డ్రైవర్‌తో చెప్పులు తొడిగించుకున్న అసెంబ్లీ స్పీకర్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎన్ శక్తన్ వివాదంలో చిక్కుకున్నారు. తన కారు డ్రైవర్‌తో ఆయన చెప్పులు తొడిగించుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం అసెంబ్లీ ఆవరణలో వరిపంట సాగుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పీకర్ శక్తన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన తన డ్రైవర్‌తో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. స్పీకర్ ధరించిన శాండిల్స్‌కి డ్రైవర్ పట్టీలు బిగిస్తున్న దృశ్యం మీడియా కంట చిక్కింది.

దీంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలెట్టాయి. కాగా, ఈ విషయమై శక్తన్ గురువారం వివరణ ఇచ్చారు. తాను గత 18 ఏళ్లుగా కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని, వైద్యులు తనను ముందుకు వంగకుండా ఉండాలని సూచించారని, అందువల్లే తన బంధువు తనకు చెప్పులు తీయడంలో సహాయం చేశాడని ఆయన తెలిపారు.
ఓ ప్రైవేటు కార్య్రక్రమానికి హాజరైనప్పుడు తీసిన ఆ ఫోటోపై చర్చ జరుగుతుండడం తనను కలచి వేసిందని శక్తన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం తగదన్నారు. 33 ఏళ్లుగా తాను శాసన సభ్యునిగా కొనసాగుతున్నాననీ, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఈ విషయాన్ని ప్రముఖంగా చూపించడం సరికాదని తెలిపారు.
కాగా, ఇటీవల మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కూడా సిబ్బందితో చెప్పులు మోయించి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications