‘కాక్రోచులా.. సింహాలా?’: కేరళ వీసీ మాటలపై రచ్చ! (వీడియో)

కేరళ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ విద్యార్థుల కార్యక్రమాల్లో చేసిన కామెంట్స్ మరోసారి వివాదానికి దారితీశాయి. తిరువనంతపురంలోని కజకూటంలో పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన 'విజయతారకం' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి.."మిమ్మల్ని కొందరు కాక్రోచ్(బొద్దింక) అని పిలుస్తాన్నరని తెలుసా?" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రస్తావన తెస్తూ ఆయన ఈ ప్రశ్న వేయడం సభలో చర్చనీయాంశమైంది.

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

వేదికపై విద్యార్థుల మౌనం.. వీసీ ప్రశ్నల వర్షం
వీసీ మోహనన్ కున్నుమ్మల్ "మీరు బొద్దింకలా లేక సింహాలా? గట్టిగా చెప్పండి" అని విద్యార్థులను నిలదీశారు. అయితే సభలో ఉన్న విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆవరణ అంతా నిశ్శబ్ధం అలుముకుంది. తాము కాక్రోచ్‌లు కాదని భావించేవారు గట్టిగా చెప్పాలని ఆయన మళ్లీ మళ్లీ ఒత్తిడి తెచ్చినప్పటికీ.. వందలాది మందిలో ఒకరిద్దరు మాత్రమే 'కాదు' అని సమాధానమిచ్చారు. విద్యార్థుల మౌనానికి స్పందిస్తూ.."మీకు ఏమైనా సందేహం ఉందా? లేక మధ్యాహ్న భోజనం లేదా టీ లభించలేదా?" అని వీసీ విద్యార్థులను అడిగారు. విద్యార్థులు కాక్రోచ్‌లుగా కాకుండా సింహాలుగా, దుర్గాదేవి స్వరూపాలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Kerala VC Mohanan Kunnummal Triggers Fresh Row With Cockroaches Lions Remark to Students Details

స్పందించిన గవర్నర్
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. వీసీ కామెంట్లపై భిన్నంగా స్పందించారు. వీసీ ఏ సందర్భంలో బొద్దింకల ప్రస్తావన తెచ్చారో తనకు స్పష్టంగా అర్థం కాలేదని పేర్కొన్నారు. అనంతరం వివిధ పోటీ పరీక్షలు, ఇతర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్..
పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్..

పెరుగుతున్న వివాదం
ఆగస్టు 15న ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీసీ మోహనన్ కున్నుమ్మల్ ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదాన్ని మరవకముందే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, యువజన ఉద్యమాలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ ఈ కామెంట్స్ చేయడం కేరళ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. వీసీ వేదికపై ఎంత ఒత్తిడి తెచ్చినా విద్యార్థులు స్పందించకుండా మౌనం వహించడం, యువత రాజకీయ ధోరణులకు అర్ధ పడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+