Khiladi lady: విదేశాల్లో ఉద్యోగం, గ్రాండ్ గా నిశ్చితార్థం, పెళ్లికూతురు జంప్, సారీ డియర్, నాకు ముందే !
చెన్నై/ తిరుచ్చి: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. సెలవుల మీద సొంత ఊరు వచ్చిన యువకుడు పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కోసం వెతికాడు. బంధువులు ఓ అమ్మాయిని సెట్ చేశారు. అమ్మాయి చూడటానికి అందంగా ఉండటంతో ఆ యువకుడు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిశ్చితార్థానికి కావలసిన బంగారు నగలు, డబ్బు పెళ్లి కొడుకు ఇచ్చాడు. నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగిపోయింది. కాబోయే భార్యకు అతను బంగారు నగలు తీసిచ్చాడు. పెళ్లి కూతురు తిరగడానికి పెళ్లి కొడుకు ఓ స్కూటీ తీసిచ్చాడు. కొంతకాలానికి నిశ్చితార్థం చేసుకున్న యువతి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కాబోయే భార్య ఎక్కడికి వెళింది అంటూ అతను ఆరా తీశాడు. పెళ్లి కూతురి ఇంటికి వెళ్లిన యువకుడు షాక్ అయ్యాడు. మా అమ్మాయి కొన్ని రోజులుగా కనపడటం లేదని అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్లక్షంగా చెప్పడంతో అతను బిత్తరపోయాడు. చివరికి పెళ్లి కూతురు తమ్ముడిని పట్టుకున్న యువకుడు అతనితో ఆమె అక్కకు ఫోన్ చేయించాడు. తమ్ముడు ఫోన్ చేస్తే మాట్లాడిన పెళ్లి కూతురు నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ చెప్పి మళ్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని తరగంబాడి తాలుకా కలియూరు ప్రాంతంలో చిన్నతంబి (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న చిన్నతంబి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న చిన్నతంబి పెళ్లి చేసుకోవాలని ఆశపడి సెలవుల మీద సొంత ఊరు వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని చిన్నతంబి మంచి అమ్మాయి కోసం వెతికాడు.

నిశ్చితార్థానికి అన్నీ పెళ్లి కొడుకు తీసిచ్చాడు
బంధువులు చిన్నతంబికి విల్లియనల్లూరులోని పెద్ద వీధిలో నివాసం ఉంటున్న అభినయ (19) అనే అమ్మాయిని సెట్ చేశారు. అభినయ చూడటానికి అందంగా ఉండటంతో చిన్నతంబి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిశ్చితార్థానికి కావలసిన బంగారు నగలు, డబ్బు పెళ్లి కొడుకు చిన్నతంబి పెళ్లికూతురు అభినయ కుటుంబ సభ్యులకు ఇచ్చాడు.

పెళ్లికూతురు మాయం
అభినయ, చిన్నతంబ్రి నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగిపోయింది. కాబోయే భార్యకు అతను బంగారు నగలు తీసిచ్చాడు. కాబోయే పెళ్లి కూతురు అభినయ తిరగడానికి పెళ్లి కొడుకు చిన్నతంబి అతని ఇంట్లో తెలీకుండా ఆమెకు ఓ స్కూటీ తీసిచ్చాడు. తరువాత ప్రతిరోజూ అభినయ, చిన్నతంబి ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు. కొంతకాలానికి నిశ్చితార్థం చేసుకున్న అభినయ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కాబోయే భార్య అభినయ ఎక్కడికి వెళింది అంటూ చిన్నతంబి ఆరా తీశాడు.

మా అమ్మాయి ఎక్కడుందో మాకే తెలీదు
పెళ్లి కూతురు అభినయ ఇంటికి వెళ్లిన చిన్నతంబి షాక్ అయ్యాడు. మా అమ్మాయి కొన్ని రోజులుగా కనపడటం లేదని అభినయ కుటుంబ సభ్యులు నిర్లక్షంగా చెప్పడంతో చిన్నతంబి బిత్తరపోయాడు. మీ అమ్మాయి అభినయతో తనకు నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అమ్మాయి కనపడటం లేదంటే ఎలా అంటూ చిన్నతంబి అభినయ కుటుంబ సభ్యులను నిలదీశాడు.

జరిగింది మరిచిపో..... నువ్వు వేరే పెళ్లి చేసుకో
చివరికి పెళ్లి కూతురు అభినయ తమ్ముడిని పట్టుకున్న చిన్నతంబి అతనితో ఆమెకు ఫోన్ చేయించాడు. తమ్ముడు ఫోన్ చేశాడని అభినయ ఫోన్ లో మాట్లాడింది. ఆ సమయంలో చిన్నతంబి ఫోన్ లాక్కొన్ని నువ్వు ఎక్కడ ఉన్నావు ?, ఎందుకు నాకు కనపడకుండా తిరుగుతున్నావు ? అంటూ ప్రశ్నించాడు. జరిగిందేదో జరిగిపోయింది, నాకు పెళ్లి జరిగిపోయింది, నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటూ అభినయ కూల్ గా చెప్పడంతో చిన్నతంబి బిత్తరపోయాడు.

నగలు, డబ్బలు ఇప్పించండి సార్
నిశ్చితార్థానికి రెండు తులాల బంగారు నగలు, నక్లెస్, స్కూటీ తీసిచ్చానని, ఖర్చులకు రూ. 50 వేలు ఇచ్చానని, ఇప్పుడు తనను అభినయ మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని చిన్నతంబి పోలీసులను ఆశ్రయించాడు. అభినయ కుటుంబ సభ్యులకు ఇచ్చిన బంగారు నగలు, నిశ్చితార్థానికి ఖర్చు అయిన రూ. 50 వేలు తిరిగి ఇవ్వకుండా అభినయ కుటుంబ సభ్యులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారని చిన్నతంబితో పాటు అతని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

అసలు ఏం జరిగింది ?
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడిని నిలువునా మోసం చేసిన యువతి వేరే యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కలకలం రేపింది. అభినయ లవ్ మ్యారేజ్ చేసుకుందా ?, ఆమెకు కుటుంబ సభ్యులే వేరే వివాహం చేశారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశతో తమిళనాడులోని సొంత ఊరు వచ్చిన చిన్నతంబికి పాలకోవ తినిపించి ఎస్కేప్ అయిన అభినయ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో వైపు చిన్నతంబికి అభినయా పెళ్లి సంబంధం చూసిన పెళ్లి పెద్దలు సైతం ఓరి దేవుడా, మాకు ఏమిటి ఇలాంటి కస్టాలు వచ్చిపడ్డాయి అంటూ బిత్తరపోయారు. పెళ్లి కూతురు అభినయ పెళ్లికి ముందే పోతేపోయింది, నాకు నా నగలు, నా డబ్బు కావాలని చిన్నతంబి పట్టబుడుతున్నాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications