Khiladi: ప్రొఫెసర్ భార్యకు కరోనా పాజిటివ్, ఆసుపత్రి 8వ అంతస్తులో హత్య, నగ్నంగా శవం, సీసీటీవీల్లో ?
చెన్నై: ప్రోఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, ఆయన భార్య అనారోగ్యానికి గురైనారు. ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు భార్యకు కరోనా పాజిటివ్ అని తేల్చి అదే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రొఫెసర్ ను హోమ్ క్వారంటైన్ లో పెట్టారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్య రెండు రోజులకే కనపడకుండా పోయింది. చివరికి రెండువారాల తరువాత అదే ఆసుపత్రి టెర్రాస్ మీద ఆమె నగ్నంగా శవమై కనిపించింది. ఏషియాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్ భార్య దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. మహిళను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తిని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు.
Beauty
business:
అమ్మాయిలు,
ఆంటీలు
పెట్టుబడి,
లాక్
డౌన్
లో
భర్తలు
లక్షాధికారులు
!

ప్రొఫెసర్ దంపతులకు అనారోగ్యం
చెన్నై సిటీలోని పశ్చిమ తాంబరం ప్రాంతంలో మౌళి, సునిత (41) దంపతులు నివాసం ఉంటున్నారు. చెన్నైలో మౌళి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సునితతో కలిసి మౌళి చాలా సంతోషంగా గడుపుతున్నాడు. గత నెల 20వ తేదీన మౌళి, సునిత దంపతులు అనారోగ్యానికి గురైనారు. వెంటనే ఇద్దరు వైద్యపరీక్షలు చేయించుకున్నారు.

రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో భార్య
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మౌళి, సునిత దంపతులకు కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు. మౌళికి కరోనా లక్షాణాలు తక్కువగా ఉండటంతో ఆయన్ను హౌమ్ క్వారంటైన్ కు పంపించారు. మౌళి భార్య సునిత మే 21వ తేదీన రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరడంతో ఆమెకు అక్కడి వైద్యులు చికిత్స ప్రారంభించారు.

రెండు రోజులకే ఆసుపత్రిలో మాయం
మే 23వ తేదీ నుంచి సునిత కనపడకపోవడంతో అక్కడి వైద్యులు ఆమె భర్త మౌళికి సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి సునిత కోసం గాలిస్తున్నా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు. జూన్ 8వ తేదీన రాజీవ్ గాంధీ ఆసుపత్రి 8వ అంతస్తు టెర్రాస్ మీద సునిత శవమై నగ్నంగా కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది హడలిపోయారు.

సీసీటీవీల్లో చిక్కిపోయింది
సునితను గొంతు కోసి దారుణంగా హత్య చెయ్యడంతో తమిళనాడులో కలకలం రేపింది. చెన్నై సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. మూడో అంతస్తులో చికిత్స పొందుతున్న సునిత నడవలేని స్థితిలో ఉందని, ఆమె ఒంటరిగా 8వ అంతస్తులోకి ఎలా వెళ్లింది ? అంటూ చెన్నై సిటీ పోలీసులు ఆరా తీశారు.

లిప్ట్ లో పిలుచుకుని వెళ్లిన రతీదేవి
ఆసుపత్రిలో ప్రతి ఫ్లోర్ లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల్లో రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న రతిదేవి (40) పోలీసుల కంట్లో పడింది. రతీదేవి టిప్ట్ లో సునితను 8వ అంతస్తులోకి పిలుచుకుని వెళ్లిన సీసీటీవీ క్లిప్పింగ్స్ ను పోలీసులు గుర్తించారు. రతీదేవిని పోలీసులు బెండ్ తీస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది.

స్టోరీ మొత్తం చెప్పిన కిలాడీలేడి
మే 23వ తేదీన సునిత దగ్గర బ్యాగ్ ఉన్న విషయం రతీదేవి గుర్తించింది. సునిత బ్యాగ్ లో డబ్బులు ఉన్న విషయం గుర్తించిన రతీదేవి ఆ డబ్బు చోరీ చెయ్యడానికి ప్రయత్నించడంతో సునిత ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునింది. ఆసుపత్రి అధికారులకు నీ విషయం చెబుతానని సునిత రతీదేవిని బెదిరించింది. డాక్టర్లకు విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుందని రతీదేవి భయపడింది.

మాస్టర్ ప్లాన్ వేసి చంపేసింది
నీకాళ్లు పట్టుకుంటాను, నాకు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, తప్పు చేశానని, ఎవ్వరికి చెప్పకూడదని రతీదేవి ప్రొఫెసర్ భార్యను వేడుకునింది. ఆదే రోజు రాత్రి కోవిడ్ పరీక్షలు చెయ్యాలని నమ్మించి వీల్ చేర్ లో సునితను లిప్టులో ఆసుపత్రి 8వ అంతస్తులోకి పిలుచుకుని వెళ్లింది. తరువాత బ్లేడ్ తో సునిత గొంతు కోసి చంపేసి ఎవరో రేప్ చేసి హత్య చేశారు అని అందరిని నమ్మించడానికి ఆమె శరీరం మీద ఉన్న దస్తులు మొత్తం తీసేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video

రూ. 9,500 కోసం చంపేసిన కిరాతకురాలు
సునితను హత్య చేసిన తరువాత ఆమె బ్యాగ్ లోని రూ. 9,500 డబ్బును రతీదేవి చోరీ చేసిందని పోలీసులు అన్నారు. తిరువోట్టియూర్ ప్రాంతానికి చెందిన రతీదేవి రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగం చేస్తోందని, డాక్టర్లు, నర్సులకు సహాయం చేస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. ఏషియాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో మహిళ హత్యకు గురికావడం కలకలం రేపింది. సునిత హత్యకు గురి కావడానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం కూడా కారణం అని ఆరోపణలు ఉన్నాయి.