కిడ్నాపైన ఆర్మీ జవాను మృతి: ఒళ్లంతా బుల్లెట్లే

కిడ్నాపైన ఆర్మీ జవాను శవమై తేలాడు. ప్రాదేశిక సైన్యానికి చెందిన 23 ఏళ్ల కాశ్మీరీ మరణించాడు. అతని శరీరమంతా బుల్లెట్ గాయాలే ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో గల తన ఇంటికి వచ్చాడు.

శ్రీనగర్: కిడ్నాపైన ఆర్మీ జవాను శవమై తేలాడు. ప్రాదేశిక సైన్యానికి చెందిన 23 ఏళ్ల కాశ్మీరీ మరణించాడు. అతని శరీరమంతా బుల్లెట్ గాయాలే ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో గల తన ఇంటికి వచ్చాడు. అయితే శుక్రవారంనాడు అతను కనిపించకుండా పోయాడు.

అతన్ని మిలిటెంట్లు చంపి ఉంటారని అధికార వర్గాలంటున్నాయి. అతని శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయని, నిన్నటి నుంచి అతను ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఈ సంఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్పీ వైద్ చెప్పారు.

Kidnapped army jawan found dead, body riddled with bullets

మృతుడు ఇర్ఫాన్ దర్ ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరా సైనిక విభాగంలో పనిచేస్తున్నాడు. పది రోజులు సెలవు పెట్టి అతను ఇంటికి వచ్చాడు. కిగామ్ ప్రాంతంలో గల వోత్ములాలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలోనే అతని కారు కూడా ఉంది.

సంఘటనా స్తలం ఇంటికి సమీపంలోనే ఉంది. నవంబర్ 26వ తేదీ వరకు అతను సెలవులో ఉన్నాడని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని ఆర్మీ అధికార ప్రతినిధి అన్నారు. సంఘటనను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. తన ఖండనను ట్వీట్టర్‌లో పోస్టు చేశారు.

కాశ్మీర్ లోయలో శాంతిని, సాధారణ పరిస్థితులను నెలకొల్పాలనే తమ దృఢ సంకల్పాన్ని ఇటువంటి చర్యల ద్వారా బలహీనపరచలేదని ముఫ్తీ అన్నారు. ఆ సంఘటనను మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. ఇంతకు ముందు నవంబర్ 1వ తేదీన బిజెపి కార్యకర్త మృతదేహం కూడా ఇలాగే బయటపడింది.

ఈ ఏడాది మిలిటెంట్ల చేతుల్లో హతమైనట్లు భావిస్తున్న సైనికుల్లో దర్ మూడోవాడు. సెప్టెంబర్ నెలలో ఇలాగే ఓ బిఎస్ఎఫ్ జవానును మిలిటెంట్లు హత్య చేశారు. మేలో మిలిటెంట్లు ఓ సైనికాధికారిని కిడ్పాప్ చేసి చంపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+