ఏపీ గవర్నర్ నియామకంపై కిరణ్ బేడీ స్పందన..! అంతా ఉత్తుత్తిదేనా?
చెన్నై : ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయ్యారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ బేడీ స్పందించారు. తనను ఏపీ గవర్నర్ గా నియమిస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ.. ఆ ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ కూడా వదంతులేనని స్పష్టం చేశారు.

అదంతా ఉత్తిదే..! ఎన్నికల్లో పోటీ చేయను
తమిళనాడు పుదుచ్చేరి తట్టాంచావడిలోని ఆది ద్రావిడర్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని గురువారం నాడు కిరణ్ బేడీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాల్ని ప్రస్తావించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదన్నారు. పరిపాలన వ్యవహారాలపై మాత్రమే మొగ్గు చూపుతానని, ఇకపై ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని వివరించారు.

వైరల్.. అంతా తుస్సే..!
ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు విభజన పూర్తయ్యాక, రెండు రాష్ట్రాలకు ఈసీఎల్ నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నరసింహన్ బదిలీకి రంగం సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో.. కిరణ్ బేడీ గవర్నర్ గా రానున్నారనే అంశం ఆసక్తిగా మారింది. ఇటీవల వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాజాగా కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారంలో నిజం లేదని తేలింది.

కిరణ్ బేడీ ప్రస్థానం
తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన కిరణ్ బేడీ.. పోలీస్ శాఖలో కీలక పదవులు నిర్వహించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 2011లో అన్నాహజారే నేతృత్వంలో తెరపైకి వచ్చిన ఇండియన్ యాంటీ కరప్షన్ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. 2015లో బీజేపీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2016 మే 22న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అప్పటినుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఏపీకి గవర్నర్ గా కిరణ్ బేడీ రానున్నారనే వార్త బాగా వైరలయింది. అదంతా ఉత్తిదేనని కిరణ్ బేడీ స్పష్టం చేయడంతో అది ఫేక్ సమాచారమని తేలిపోయింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications