మోడీ లేబర్ ఫ్రెండ్లీ స్కీమ్, పాశ్చాత్య విద్యపై రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లేబర్ ఫ్రెండ్లీ పథకాన్ని గురువారం ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శ్రమేవ జయతే' పథకాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం 'శ్రమ సువిధ పోర్టల్'ను కూడా ప్రారంభించారు. తరువాత శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను కూడా మోడీ ఆరంభించారు.

సత్యమేవ జయతే ఎంత శక్తిమంతమో శ్రమేవ జయతే కూడా అంతే శక్తిమంతమైనదని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఇక శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడికి వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందన్నారు. శాశ్వత సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడకు వెళ్లినా ఒకే సంఖ్య ఉంటుందన్నారు.

Narendra Modi

ప్రతి వస్తువు నిర్మాణం వెనుక పేదవాడి కష్టం ఉంటుందని, దేశానికి వారే నిర్మాతలు అన్నారు. నైపుణ్యం గల యువతను మనం సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరముందని చెప్పారు. సత్యమేవ జయతే ఎంత శక్తిమంతమో.. శ్రమవే జయతే అంతే శక్తిమంతమైనదన్నారు.

దేశంలో ఐటీఐలను పరిపుష్టం చేయాల్సిన అవసరముందన్నారు. శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడకు వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందన్నారు. కూలీలు, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల దృక్పథాన్ని మారుస్తామన్నారు. ఈ గవర్నెన్స్ ద్వారానే పారదర్శకత పాలన సాధ్యపడుతుందన్నారు. కార్మికుల సమస్యలను వారి కోణంలోనే చూడాలన్నారు.

నైపుణ్యం కలిగిన యువతను మనం ఇప్పటి నుండే తయారు చేద్దామని, 2020 నాటికి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఒకప్పుడు ధ్రువపత్రం కావాలంటే గెజిటెడ్ అధికారి సంతకం కావాలని, కానీ ఇప్పుడు ధ్రువపత్రాలను ఆన్ లైన్లో అందజేస్తున్నామన్నారు.

మన యువతకు ఉద్యోగం కావాలని, పారిశ్రామికవేత్తలకు పని చేసేవాళ్లు కావాలని స్పష్టం చేశారు. అంతకుముందు మోడీ శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను ప్రారంభించారు.

పాశ్చాత్య విద్య అంశం భారతీయ సంస్కృతికి దెబ్బ కొట్టింది: రాజ్‌నాథ్

బ్రిటీష్ వారు తీసుకొచ్చిన పాశ్చాత్య విద్యా విధాన అంశం భారతీయ సంస్కృతికి, విలువలకు తీవ్రంగా దెబ్బ కొట్టిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుత వ్యవస్థ విద్య యొక్క ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడంలేదని పేర్కొన్నారు. ఈ మేరకు జోథ్ పూర్ లోని ఓ పాఠశాల శత వార్షిక వేడుల్లో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "విద్య అనేది వ్యక్తిత్వ సమగ్ర అభివృద్ధికి సంబంధించినది. కానీ, ప్రస్తుత విద్యా వ్యవస్థ ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడంలేదు" అని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+