భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు దుర్మరణం, 20 మంది గల్లంతు!
దేశమంతా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి ఉండగా.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా శివార్లలోని నజీరాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఆహార పదార్థాల గోదాంలో మొదలైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది.
అసలేం జరిగిందంటే?
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నజీరాబాద్ (ఆనందపూర్ ప్రాంతం)లో ఉన్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్ల గోదాములో జనవరి 26 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. గోదాము లోపల పని చేస్తున్న సుమారు 20 మంది కార్మికులు గల్లంతైనట్లు వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బయట నుంచి తాళం వేయడమే శాపమైందా?
ప్రమాదం జరిగిన సమయంలో గోదాముకు బయట నుంచి తాళం వేసి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల లోపల ఉన్న సెక్యూరిటీ గార్డులు, నైట్ డ్యూటీలో ఉన్న కార్మికులు బయటకు రాలేకపోయారు. గల్లీలు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పైపుల పొడవు సరిపోకపోవడంతో మంటలను అదుపు చేయడం ప్రారంభంలో కష్టతరమైంది.
రంగంలోకి 15 ఫైర్ ఇంజన్లు
అగ్నిమాపక శాఖ వెంటనే అప్రమత్తమై 15 ఫైర్ ఇంజన్లను, డజన్ల కొద్దీ ఫైర్ ఫైటర్లను రంగంలోకి దించింది. గ్యాస్ కట్టర్ల సాయంతో గోదాము గోడలను, తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.ప్రస్తుతం మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీశారు.మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రభుత్వ స్పందన
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. "పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాం. ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదు, బాధిత కుటుంబాలను ఆదుకోవడమే మా ప్రాధాన్యత" అని ఆయన పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గోదాముల్లో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. పండుగ పూట జరిగిన ఈ ప్రమాదం కోల్‌కతాలో తీరని శోకాన్ని నింపింది. గల్లంతైన 20 మంది కార్మికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications