సైబర్ భద్రతకు ధీటు చర్యలు: కెటిఆర్ సూచన (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సైబర్ భద్రత అంశంపై శుక్రవారం నిర్వహించిన ఒక రోజు సదస్సులో ఆయన మాట్లాడారు.

తెలంగాణ పోలీసు శాఖ సిఐడి విభాగం అదనపపు డిజి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి నిమిషం 11 మిలియన్ల సంభాషణలు ఫోన్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇందులో రెండు మిలియన్ల మంది ఆన్‌లైన్ ద్వారా అశ్లీల సాహిత్యాన్ని చదువుతున్నారని, చూస్తున్నారన్నారు.

సైబర్ భద్రతకు ఒక విధానాన్ని రూపొందించుకోవాలన్నారు. కార్పోరేట్ రంగంలో సైబర్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. సిఐఐ ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, సిఐఐ చైర్మన్ చిట్టూరి సురేష్ ,సిఐఐ వైస్‌చైర్మన్ వనితా దాట్ల తదితరులు ప్రసంగించారు.

ఐటి వర్కర్ల సేవలు

ఐటి వర్కర్ల సేవలు

సైబర్ భద్రతకు నిపుణులైన ఐటి వర్కర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కెటి రామారావు అన్నారు. భవిష్యత్తులో సైబర్ దాడులును ఎదుర్కొనేందుకు సరైన సైబర్ రక్షణ చర్యలను అమలు చేయాలన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

సైబర్ రంగానికి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

వ్యూహంగా మార్చుకుని...

వ్యూహంగా మార్చుకుని...

సమాచార భద్రతను బిజినెస్ వ్యూహంగా మార్చుకుని అభివృద్ధికి కృషి చేయాలని కెటిఆర్ అన్నారు. మన దేశానికి సైబర్ దాడులను ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. సమాచార భద్రత రోజూవారీ వ్యవహారిక వ్యూహంలో భాగం కావాలన్నారు.

సదస్సులో ఇలా..

సదస్సులో ఇలా..

సదస్సులో సైబర్ నేరాలు, సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, పరిష్కారాలు తదితర అంశాలపై నిపుణులు ప్రసంగించారు. ఈ సదస్సుకు 150 మంది నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఐటి శాస్తవ్రేత్తలు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+