Lady: బిడ్డను రూ. 2. 50 లక్షలకు అమ్మేసిన తల్లి, గంటలోనే డబ్బు లాక్కెళ్లారని ?, థ్రిల్లర్ సినిమా, మైండ్ బ్లాక్
చెన్నై: పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ కూతురు ఉంది. దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు. భర్తతో విడిపోయిన మహిళ గర్బవతి అయ్యింది. విషయం తెలుసుకున్న భార్య నేను ఇప్పుడు భర్తతో కలిసి జీవించలేదని, ఇప్పుడు గర్బవతి అని తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే తనకు పరువు పోతుందని ఆమె భయపడింది. అబార్షన్ చేయించుకోవడానికి మహిళ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఓ కిలాడీ లేడి ఆమెకు పరిచయం అయ్యింది. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నీకు లేనిపోయిన ఆరోగ్య సమస్యలు వస్తాయని, నువ్వు బిడ్డను కని మాకు ఇస్తే నీకు లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పింది. ఎవ్వరికి తెలీకుండా ఆమె బిడ్డకు జన్మనించింది. బిడ్డను విక్రయించడంతో ఆమెకు రూ. 2.50 లక్షలు డబ్బులు ఇచ్చారు. బిడ్డను అమ్మేస్తే వచ్చిన రూ. 2.50 లక్షల డబ్బులు తీసుకుని కూతురితో కలిసి వెలుతుంటే బైక్ లో వెళ్లి ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గర డబ్బులు లాక్కొని పరారైనారు. తన డబ్బులు లాక్కొన్ని పరారైనారని బిడ్డ తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

భర్తతో విడిపోయిన భార్య
చెన్నై సిటీలోని పుఝల్ ప్రాంతంలోని కవంకరైయ్యన్ ప్రాంతంలో యాస్మిన్ (29) అనే మహిళ నివాసం ఉంటున్నది. 11 సంవత్సరాల క్రితం యాస్మిన్ మోహన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న యాస్మిన్ ఆమె భర్త మోహన్ తో సంతోషంగా కాపురం చేసింది. యాస్మిన్, మోహన్ దంపతులకు ఓ కూతురు ఉంది. యాస్మిన్ దంపతుల మద్య తేడాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

భర్తను వదిలేసిన తరువాత గర్బవతి అని తెలిసింది
భర్తకు దూరంగా ఉంటున్న యాస్మిన్ ఆమె కూతురిలో కలిసి నివాసం ఉంటున్నది. భర్తకు దూరం అయ్యే సమయానికే యాస్మిన్ గర్బవతి అయ్యిందని సమాచారం. అనారోగ్యానికి గురైనా యాస్మిన్ చెన్నైలెని ఎల్లిస్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో యాస్మిన్ గర్బవతి అని వైద్యులు చెప్పారు.

సమాజానికి భయపడిన యాస్మిన్
తాను ఇప్పుడు భర్త మోహన్ తో కలిసి జీవించలేదని, ఇప్పుడు గర్బవతి అని తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే తనకు పరువు పోతుందని యాస్మిన్ భయపడింది. తన మీద తన మాజీ భర్తతో పాటు కుటుంబ సభ్యులకు అనుమానం వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని, అబార్షన్ చేసుకోవాలని యాస్మిన్ అనుకుంది.

టచ్ లోకి వచ్చిన కిలాడీ లేడి
అబార్షన్ చేయించుకోవడానికి యాస్మిన్ ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఎర్నాకుళంకు చెందిన జయశీల అలియాస్ జయ (49) అనే కిలాడీ లేడి యాస్మిన్ కు పరిచయం అయ్యింది. ఆ సమయంలో యాస్మిన్, జయశీల ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తాను భర్తకు దూరంగా ఉంటున్నానని, ఇప్పుడు గర్బవతి అయ్యానని యాస్మిన్ ఆసుపత్రిలో పరిచయం అయిన జయశీలకు చెప్పింది.

బిడ్డను ఇస్తే రూ. లక్షలు ఇస్తాము
నువ్వు అబార్షన్ చేయించుకుంటే నీకు లేనిపోయిన ఆరోగ్య సమస్యలు వస్తాయని, నువ్వు బిడ్డను కని పిల్లలు లేనివారికి ఇస్తే నీకు లక్షల రూపాయల డబ్బులు ఇస్తారని జయశీల ఆసుపత్రికి వెళ్లిన యాస్మిన్ కు చెప్పింది. కొన్ని లక్షల రూపాయల డబ్బులు వస్తే తన బిడ్డ ఖర్చులకు ఉంటుందని యాస్మిన్ ఆలోచించింది.

ఎవ్వరికీ తెలీకుండా బిడ్డను కని ఇచ్చింది
యాస్మిన్ బుర్ఖా వేసుకుని ఆమె గర్బవతి అనే విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంది. యాస్మిన్ బుర్ఖా వేసుకోవడంతో ఆమె గర్బవతి అనే విషయం ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఎవ్వరికి తెలీకుండా యాస్మిన్ ఈనెల 21వ తేదీన వాషర్ మెన్ పేట్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనించింది. 24వ తేదీన యాస్మిన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యింది. బిడ్డను జయశీలకు విక్రయించడంతో ఆమెతో పాటు మరో మహిళ కలిసి యాస్మిన్ కు ఆసుపత్రిలోనే రూ. 2.50 లక్షలు డబ్బులు ఇచ్చారు.

సినిమా స్టైల్లో రూ. 2. 50 లక్షలు లూటీ అయ్యాయని ?
బిడ్డను విక్రయించినదానికి రూ. 2. 50 లక్షలు రావడంతో ఆ డబ్బు బ్యాగ్ లో పెట్టుకున్న యాస్మిన్ ఆమె 10 ఏళ్ల కూతురితో కలిసి ఆసుపత్రి నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తన చేతిలో ఉన్న డబ్బు బ్యాగ్ ను లాక్కోని వెళ్లిపోయారని యాస్మిన్ వేలచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బు ఉన్న బ్యాగ్ గట్టిగా పట్టుకుని కేకలు వేశానని, డబ్బు ఉన్న బ్యాగ్ చెయ్యిజారిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించానని, అయినా నిందితులు రూ. 2. 50 లక్షలు ఉన్న బ్యాగ్ లాక్కొని అక్కడి నుంచి పరారైనారని యాస్మిన్ పోలీసు కేసు పెట్టింది.

నాటకాలు ఆడిన యాస్మిన్ ?
యాస్మిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. యాస్మిన్ ఆమె బిడ్డను అమ్మేస్తే రూ. 2. 50 లక్షలు వచ్చిందని, ఆ విషయం తమ దగ్గర దాచిపెట్టిందని పోలీసులు గుర్తించారు. మొదట జయశీలను, దేవి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. 13 సంవత్సరాలుగా పిల్లలు లేని శివకుమార్, శ్రీదేవి దంపతులు యాస్మిక్ కు రూ. 2. 50 లక్షలు ఇచ్చి బిడ్డను కొనుక్కున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే యాస్మిన్ మా దగ్గర నాటకాలు ఆడిందని పోలీసులు గుర్తించారు.
Recommended Video

బిడ్డ, డబ్బులు మొత్తం కావాలని
యాస్మిన్ బిడ్డను విక్రయించగా వచ్చిన డబ్బును వేరే వ్యక్తి చేతికి ఇచ్చి దాచి పెట్టిందని, మరుసటి రోజు ఆ డబ్బు యాస్మిన్ తీసుకుందని వెలుగు చూసింది. అయితే జయశీల, యాస్మిన్ కలిసి నాటకాలు ఆడారని వెలుగు చూడటంతో పోలీసులకు మండిపోయింది. తప్పుడు కేసు పెట్టి మా టైమ్ వేస్ట్ చేశారని, బిడ్డను అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ ఇద్దరు మహిళల మీద కేసు నమోదు చేసి అందర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి చిన్నారిని రక్షించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని సీనియర్ పోలీసు అధికారి కార్తికేయన్ మీడియాకు చెప్పారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications