Lady: అమ్మాయి ఫర్ సేల్, మేడమ్ కు నో బెయిల్, అసలు మ్యాటర్, లక్షల్లో డీల్ చేసి క్లైమాక్స్ లో !
చెన్నై/తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని లాల్‌గుడికి చెందిన ఓ మహిళ గర్భవతి అయ్యింది. పెళ్లి కాకుండానే తాను గర్బవతి అయ్యానని, తనకు ఏదైనా దారి చూపించాలని తెలిసిన న్యాయవాది ప్రభుకు చెప్పింది. పుట్టిన తర్వాత బిడ్డను మేము చూసుకుంటామని లాయర్ ఆమెకు చెప్పాడని తెలిసింది. తరువాత కథ అనేక మలుపులు తిరిగింది. ఈ కేసు రాష్ట్రాలు దాటుకుంటూ వేరేవేరే ప్రాంతాలకు వెళ్లిపోయింది.
ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభు, అతని భార్య షణ్ముగవల్లి ఆ బిడ్డను రూ. 5 లక్షల రూపాయలకు అమ్మేశారు. బిడ్డ తల్లికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన లాయర్ చివరికి ఆమెకు 20వేల రూపాయల మాత్రమే ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత తన కూతురిని రూ. 5 లక్షలకు విక్రయించారని తెలుసుకున్న మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు జరిపిన విచారణలో మహిళ కోరిక మేరకే చిన్నారిని విక్రయించినట్లు పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత బిడ్డను విక్రయించారనే ఫిర్యాదులో ప్రభు భార్య షణ్ముగవల్లి, ఆకాష్, బ్రోకర్ కవితాలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడు గోపీనాథ్ ద్వారా చిన్నారిని విక్రయించినట్లు పోలీసులు జరిపిన విచారణలో వెలుగు చూసింది.
ఈ కేసులో జైలులో ఉన్న షణ్ముగవల్లి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మధరై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఆ సమయంలో వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిల్లలను విక్రయించే ముఠాతో వీరికి ఏమైనా సంబంధం ఉందా? అని దర్యాప్తు చేస్తున్నారని, కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటంతో ఆమెకు బెయిల్ ఇవ్వకూడాదని అభ్యంతరం వ్యక్యం చేశారు. దీంతో న్యాయమూర్తి నిందితురాలు షణ్ముగవల్లి బెయిల్ పిటీసన్ విచారణ వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications