బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady leader: ఎస్ఐ పరీక్షల స్కామ్, పూణేలో దివ్యా మేడమ్ అండ్ కో అరెస్టు, ఆల్ ఇన్ వన్ డీల్ తో రిస్క్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరుల/ముంబాయి/పూణే: ఎస్ఐ ఉద్యోగాల నియామకం రాతపరీక్షల స్కామ్ కేసు కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి తలనొప్పిగా తయారైయ్యింది. విద్యాసంస్థల యజమాని, బీజేపీ లేడీ లీడర్ దివ్యా వ్యవహారం బయటకు రావడంతో ఆమె భర్తను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో తలదాచుకున్న బీజేపీ లేడీ లీడర్ దివ్యాతో పాటు మరికొందరిని సీఐడీ పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. లేడీ లీడర్ దివ్యా స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న ముగ్గురు మహిళలను ఇప్పటికే అరెస్టు చేశారు. సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ దివ్యా మాయం కావడంతో ఆమె భర్తను అరెస్టు చేశారు. లేడీ లీడర్ దివ్యా విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ముగ్గురు అరెస్టు అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించి బీజేపీ నాయకురాలు దివ్యా కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వచ్చిన వెంటనే ఆమె మాయం అయ్యారు. 16 రోజుల నుంచి సీఐడీ పోలీసులకు సినిమా చూపించి తప్పించుకుని తిరుగుతున్న లేడీ లీడర్ దివ్యా కోసం సీఐడీ పోలీసులు వేట ముమ్మరం చేసి చివరికి ఆమెను మహారాష్ట్రలోని పూణేలో అరెస్టు చేశారు.

Illegal affair: కొత్త పెళ్లి కూతురు, పుట్టింటి పక్కన ప్రియుడితో ఎంజాయ్, భార్య చీరతో కొత్త పెళ్లి కొడుకు, అంతేIllegal affair: కొత్త పెళ్లి కూతురు, పుట్టింటి పక్కన ప్రియుడితో ఎంజాయ్, భార్య చీరతో కొత్త పెళ్లి కొడుకు, అంతే

పోలీసు అధికారి కావాలని ఆశ

పోలీసు అధికారి కావాలని ఆశ

కర్ణాటకలో ఇటీవల పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ (SI) ఉద్యోగాలకు రాతసరీక్షలు జరిగాయి. ఎస్ఐ ఉద్యోగాలు సంపాధించాలని వేలాది మంది నిరుద్యోగులు రాతపరీక్షలకు హాజరైనారు. కలబురిగి జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరీక్షా కేంద్రంలో నిరుద్యోగులు ఎస్ఐ ఉద్యోగాల కోసం రాతపరీక్షలు రాశారు.

డీల్ రాజా డీల్

డీల్ రాజా డీల్

బీజేపీ నాయకురాలు అయిన దివ్యా జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్ఐ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని వెలుగు చూడటంతో పోలీసులు అధికారులు ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పరీక్షలు రాసిన అభ్యర్థుల ఐఎంఆర్ షీట్లలో భారీగా అవకతవకలు జరిగాయని, కొందరు ఐఎంఆర్ షీట్లు ఖాళీగా ఇచ్చిన తరువాత కొందరు లెక్సరర్స్ ఆ జవాబు పత్రాల్లో అన్సర్లు రాశారని వెలుగు చూసింది.

భర్త అరెస్టు కావడంతో లేడీ లీడర్ ఎస్కేప్

భర్త అరెస్టు కావడంతో లేడీ లీడర్ ఎస్కేప్


బీజేపీ లేడీ లీడర్ దివ్యా స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న సుమిత్రా, సుమా, సిద్దమ్మ అనే ముగ్గురు మహిళా టీచర్లను 10 రోజుల క్రితమే (ఈనెల 17వ తేదీ) సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ దివ్యా మాయం కావడంతో ఆమె భర్త రాజేష్ ను విచారణ చేసి చివరికి ఆయన్ను వారం రోజుల క్రితమే అరెస్టు చేశారు.

పక్కాస్కెచ్ తో మేడమ్ ఎస్కేప్

పక్కాస్కెచ్ తో మేడమ్ ఎస్కేప్

సీఐడీ పోలీసులు బీజేపీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ మాయం కావడంతో ఆమె భర్త రాజేష్ ను అరెస్టు చేశారు. లేడీ లీడర్ దివ్యా విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ముగ్గురు అరెస్టు అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ నాయకురాలు దివ్యా కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వచ్చిన వెంటనే ఆమె మాయం కావడంతో లేడీ లీడర్ కోసం సీఐడీ పోలీసులు వేట ముమ్మరం చేశారు.

అరెస్టు వారెంట్.... ఆస్తులు సీజ్ చెయ్యాలని కోర్టు ఆదేశం

అరెస్టు వారెంట్.... ఆస్తులు సీజ్ చెయ్యాలని కోర్టు ఆదేశం

బీజేపీ నాయకురాలు దివ్యా మాయం కావడంతో ఆమె కోసం సీఐడీ అధికారులు రెండు వారాల నుంచి గాలిస్తున్నారు. దివ్యాను అరెస్టు చెయ్యాలని ఇప్పటికే కోర్టు ఆరెస్టు వారెంట్ జారీ చేసింది, వారం రోజుల్లో లొంగిపోకపోతే ఆమె ఆస్తులు సీజ్ చెయ్యడానికి సీఐడీ అధికారులకు కోర్టు అవకాశం ఇచ్చింది. అయితే పోలీసులు కళ్లు కప్పతి తప్పించుకుని తిరుగుతున్న దివ్యా మహారాష్ట్రలోని పూణేలో తలదాచుకుందని పక్కా సమాచారం అందడంతో సీఐడీ అధికారులు అక్కడే ఆమెను అరెస్టు చేశారు.

పూణే టూ కర్ణాటక

పూణే టూ కర్ణాటక

బీజేపీ నాయకురాలు దివ్యాతో పాటు ఆమె ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న లేడీ టీచర్లు అర్చనా, సునందా, ఎస్ఐ పరీక్షలు రాసిన శాంతిబాయి అనే నలుగురిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వారిని కర్ణాటక తీసుకు వచ్చి కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ముందు హాజరుపరిచిన తరువాత కోర్టు అనుమతితో దివ్యాను కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాలని సీఐడీ అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
Lady leader: SI exam scam: Accused and BJP leader Divya Hagargi arrested by Karnataka CID police in Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X