వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీకటిని చీల్చుకుంటూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మకరవిళక్కు పర్వం సందర్భంగా శనివారం లక్షలాది మంది శబరిమల భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ హరిహరక్షేత్రం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది.

శనివారం రాత్రి 6.45 గంటలకు జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 Lakhs of devotees witness Makara Jyothi at Sabarimala

అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతిచ్చారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.


స్వామియే శరణం అయ్యప్ప అంటూ జ్యోతిని దర్శించుకున్న భక్తులు ఆనందపరావశ్యులయ్యారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. జనవరి 20వ తేదీన స్వామివారి ఆలయం మూసివేయనున్నారు.

English summary
Lakhs of devotees witness Makara Jyothi at Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X