మరో మోహన్ బాబు- చిచ్చు పెట్టిన అనూష్క
Lalu Prasad Yadav: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాద్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆరు సంవత్సరాల పాటు కి చెందిన ఎలాంటి కార్యక్రమాలతో పాల్గొనకూడదని హెచ్చరించారు.
అక్కడితో ఆగలేదా ఆర్జేడీ పెద్దాయన. కుటుంబం నుంచి కూడా వేలివేశారు. ఆయనతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటాంచారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, వాటిని అవహేళన చేయడం, అవమాన పరిచేలా ప్రవర్తించడం ఏ మాత్రం ఉపేక్షించదలిచిన అంశం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం సాగిస్తోన్న సమష్టి పోరాటం బలహీనపడుతుందని వ్యాఖ్యానించారు.
పెద్ద కుమారుడు సాగిస్తోన్న వ్యవహారాలు, బాధ్యతరాహిత్యంతో కూడిన ఆయన ప్రవర్తన విధానం తమ కుటుంబ విలువలు, సంస్కారాలకు విరుద్ధమని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పెద్ద కుమారుడిని కుటుంబం, పార్టీ నుంచి బహిష్కరించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.
ఇప్పటి నుంచి పార్టీ, కుటుంబంలో తేజ్ ప్రతాప్ యాదవ్ కు సంబంధించిన ఎలాంటి పాత్ర ఉండదని తెలిపారు. పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితంలో మంచి-చెడు, యోగ్యత- అయోగ్యత, లోపాలు ఏమిటో తెలుసుకునే వివక్ష పెద్ద కుమారుడికి ఉందని గుర్తు చేశారు.
ఆయనతో పాటు ఎవరైనా సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే తమ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలని, ఉండాలా? వద్దా? అనేది వివేకంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పెద్ద కుమారుడిని బహిష్కరించాలనే నిర్ణయం తన ఒక్కడిదే కాదని, కుటుంబ సభ్యుల అంగీకారంతో దీన్ని తీసుకున్నామని ట్వీట్ చివర్లో వివరణ ఇచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్.
లాలూ ఇంత కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణాలు లేకపోలేదని తెలుస్తోంది. తరచూ తన గర్ల్ ఫ్రెండ్ అనూష్క యాదవ్ తో కలిసి తిరుగుతోండటం, ఆమెతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోండటమేనని చెబుతున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే వివాహితుడు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్యర్య రాయ్ ను పెళ్లి చేసుకున్నాడు తేజ్ ప్రతాప్ యాదవ్. 2018లో వారిద్దరి వివాహం జరిగింది. ఇప్పుడు అనూష్క యాదవ్ తో సంబంధాలను కొనసాగిస్తోన్నాడాయన.
శనివారం ఆమెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. 12 సంవత్సరాలుగా ఆమెతో రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీయడంతో.. తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని తేజ్ ప్రతాప్ యాదవ్ వివరణ ఇచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.












Click it and Unblock the Notifications