నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ముఖ్యనేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ.. ప్రత్యర్థులపై అనూహ్య ఆరోపణలకు దిగారు. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ విషయంలో విమర్శలు ఎదుర్కోంటోన్న బీజేపీ తాజాగా మోదీ కామెంట్లపైనా ముప్పేటదాడిని చవిచూడాల్సిన పరిస్థితి. 15ఏళ్ల ఎన్డీఏ పాలనలో చెప్పుకోడానికి ఏమీ లేక ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకీ సుశీల్ మోదీ ఏమన్నారంటే..

లాలూ తాంత్రిక పూజలు..
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి, సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన మోదీ.. మూడేళ్ల కిందట తనను చంపడానికి లాలూ యాదవ్ తాంత్రిక కర్మలు చేశారని ఆరోపించారు. మీర్జాపూర్ వింధ్యచల్ థామ్ వద్ద ఆ తంతు జరిగిందని చెప్పారు. మహా తాంత్రికుడిగా పేరుపొందిన శంకర్ చరణ్ త్రిపాఠి అంటే లాలూకు బాగా గురి ఉందని, కాబట్టే త్రిపాఠిని ఆర్జేడీ జాతీయ ప్రతినిధిగానూ నియమించారని మోదీ తెలిపారు.

దసరాకు జంతు బలి..
‘‘లాలూ ప్రసాద్ ప్రజల్ని నమ్మరు. కేవలం మూఢనమ్మకాలనే విశ్వసిస్తారు. కేవలం తాంత్రికులు చెప్పారనే ఆయన తెల్ల కుర్తా ధరించడం మానేశారు. జంతుబలి, ఆత్మలను ప్రార్థించడం ఆయనకు అలవాటైన పనులు. చేతబడి కూడా తెలుసు. ప్రస్తుతం రాంచీలోని జైలులో ఉన్న లాలూ.. నిబంధనలకు విరుద్ధంగా దసరా పండుగ రోజున మూడు మేకల్ని బలి ఇవ్వబోతున్నారు'' అని సుశీల్ మోదీ పేర్కొన్నారు. ఇన్ని తాంత్రిక పూజలు చేసినా లాలూ జైలు నుంచి తప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
Recommended Video

నాడు తెలంగాణలో సూర్యగ్రహణం రోజునా..
2009లో సూర్యగ్రహణాన్ని చూసేందుకు తెలంగాణ(ఉమ్మడి ఆంధ్ర)కు వెళ్లిన నితీశ్.. గ్రహణం సమయంలో బిస్కెట్లు తిన్నందుకు బీహార్ లో కరువు ఏర్పడుతుందని లాలూ శపించారని, కానీ ఆ ఏడాది బీహార్ లో పంటలు బాగా పండాయని, లాలూ మూఢనమ్మకాలకు ఇవి చాలా చిన్న ఉదాహరణలని బీజేపీ నేత సుశీల్ మోదీ అన్నారు. నితీశ్ పాలనలో పాలనలో బీహార్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రయత్నించినా ఎన్డీఏనే గెలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications