దాణా కంభకోణం: జైలు నుండి లాలూ ప్రసాద్ విడుదల
రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం రాంచీ జైలు నుండి విడుదలయ్యారు. గడ్డి కుంభకోణం కేసులో లాలూ నిందితుడిగా ఉన్నారు. అక్టోబర్ నెలలో జైలుకు వెళ్లిన లాలూ ఈ రోజు బిర్సాముండా జైలు నుండి బయటకు వచ్చారు.
గడ్డి కుంభ కోణం కేసులో లాలూ యాదవ్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు అక్టోబర్ 3వ తేదీన తీర్పు చెప్పింది. అనంతరం ఆయన బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. అక్కడ చుక్కెదురయింది. జార్ఖండ్ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతను సోమవారం విడుదలయ్యారు.
ఈ సందర్భంగా లాలూ మాట్లాడారు. తాము మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఏకం చేస్తానన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఢీకొడతామన్నారు. లోక్‌పాల్ బిల్లును అఢ్డుకునేందుకు అన్నాహజారే లాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వరకే పరిమితమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదన్నారు.

కాగా, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. నిందితులుగా నిర్దారించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు వారికి అప్పుడు శిక్షను ఖరారు చేసింది. లాలూకు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొన్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్.
మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం 61 కేసులు నమోదు కాగా 41 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. కేసుకు సంబంధించి 56 మందిపై కేసు నమోదు కాగా విచారణ కాలంలో 7గురు మృతి చెందారు. లాలూ సహా 45 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications