వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోర్ కార్యక్రమాలపై 2 నెలలు నిషేధం విధించాల్సిందే.. అలా అయితేనే కరోనా కట్టడి :లాన్సెట్ కోవిడ్ కమిషన్

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు ఇండోర్ సమావేశాలను పూర్తిగా నిషేధించాలని లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్‌కు చెందిన భారత టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. దేశంలో జరుగుతున్న మతపరమైన,రాజకీయపరమైన కార్యక్రమాలు, వివాహ వేడుకలు,క్రీడా కార్యక్రమాలే కరోనా వ్యాప్తికి కారణమని పేర్కొంది. కాబట్టి వచ్చే రెండు నెలల పాటు 10 మంది కన్నా ఎక్కువమంది ఒకచోట చేరకుండా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ ఒక నివేదికను వెలువరించింది.

కేసులు పెరుగుతున్నా ఆంక్షలేవీ : లాన్సెట్

కేసులు పెరుగుతున్నా ఆంక్షలేవీ : లాన్సెట్

దేశంలో రాజకీయ సభలు,కార్యక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు విధించలేదని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా... మరోవైపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో కుంభమేళా కారణంగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవని పేర్కొంది. ఏప్రిల్ 30 కన్నా ముందే కుంభమేళాను ముగించాలన్న ప్రతిపాదనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తెలిపింది.

థియేటర్స్,స్టేడియాలు అన్నీ మూసివేయాలని...

థియేటర్స్,స్టేడియాలు అన్నీ మూసివేయాలని...

ప్రజారోగ్యం కన్నా ఏదీ ఎక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ కమిషన్ ఇండియా టాస్క్‌ఫోర్స్ తెలిపింది. జిల్లాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ అవసరమని సూచించింది. 50 కన్నా ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలైన థియేటర్లు,స్పోర్ట్స్ సెంటర్స్,స్టేడియాలు,ఇండోర్ హాల్స్‌ను రెండు నెలల పాటు పూర్తిగా మూసివేయడం మంచిదని సూచించింది. ఢిల్లీలో ప్రస్తుతం 30శాతం ఆక్యుపెన్సీ కెపాసిటీతో థియేటర్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ,తెలంగాణల్లో ఇప్పటికీ 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి.

Recommended Video

WHO Chief Calls Growth In Covid-19 Cases ''worrying'' | Oneindia Telugu
టెస్టింగ్,ట్రేసింగ్,ఐసోలేషన్ స్పీడప్ చేయాలని...

టెస్టింగ్,ట్రేసింగ్,ఐసోలేషన్ స్పీడప్ చేయాలని...


కరోనా కట్టడిలో కచ్చితమైన టెస్టింగ్,ట్రేసింగ్,త్వరితగతిన ఐసోలేషన్ చర్యలు చాలా ముఖ్యమని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది.ఇందుకోసం కమ్యూనిటీ సాయం కూడా అవసరమని తెలిపింది. ఇప్పటికే కోవిడ్ సోకినవారిని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉందని... జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ కేర్ సెంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లను ఐసోలేట్ చేయాలని సూచించింది. కాగా,సెకండ్ వేవ్ నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే జనతా కర్ఫ్యూ విధించగా ఢిల్లీలో వీకెండ్ లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా సండే లాక్‌డౌన్ ప్రకటించారు. మున్ముందు మరిన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.

English summary
There should be a complete ban on indoor gatherings for at least two months, the Lancet Covid-19 Commission's India Task Force has said in a report. This measure can help control the surge of infections in India, the report goes on to say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X