ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం! చిక్కుకుపోయిన 15000 మంది భక్తులు
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో 1500 మంది చార్‌ధామ్ యాత్రికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది.
రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించే పనిలో నిమగ్నం అయ్యాయి.

అయితే కొండ చరియలు విరిగి పడిన ఘటనలో యాత్రికులు ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. నాలుగేళ్ల కిందట చార్‌ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications