సీఎంకు తలనొప్పిగా తయారైన సొంత పార్టీ నాయకులు, ఆ అమ్మాయి విషయంలో ?
రేపటికి అంటే మే 18వ తేదీకి హుబ్బళిలో నేహా హీరేమఠ్ హత్య జరిగి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఈ క్రమంలో అంజలి అంబిగర్ అనే యువతి హత్యకు గురైంది. ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు హుబ్బళి-ధారవాడలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. నెల రోజుల క్రితమే కూతురు నేహాను కోల్పోయిన ఆమె తండ్రి, హుబ్బళి కార్పోరేటర్ నిరంజన్ హిరేమఠ్ నిరసన వ్యక్తం చేశారు.
హుబ్బళిలో అంజలి అంబిగర్ హత్యను ఖండిస్తూ శనివారం నాడు ఉధృతంగా నిరసనలు వ్యక్తం చేపట్టనున్నట్లు నేహా తండ్రి, హుబ్బళి కార్పొరేషన్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన కార్పోరేటర్ నిరంజన్ శనివారం అంజలి హత్యను ఖండిస్తూ పెద్దఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. అంజలి అంబిగర్ హత్యకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని కార్పోరేటర్ నిరంజన్ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హుబ్బళి కార్పోరేటర్ నిరంజన్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడే కావడంతో సిద్దరామయ్య ప్రభుత్వానికి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. హుబ్బళి దాజీబాన్‌పేట, తుళ్లిపేట మీదుగా చెన్నమ్మ సర్కిల్ వరకు నిరసన చేపట్టనున్నారు. తన కుమార్తె నేహా హత్య తరహాలో మరోసారి అంజలి హత్యకు గురి అయ్యింది. పదేపదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో పోరాటానికి సిద్ధమయ్యామని కార్పోరేటర్ నిరంజన్ తెలిపారు.

కర్ణాటకలో గూండా రాజ్యం లాంటిది మొదలైయ్యిందని, స్వామీజీలను ప్రభుత్వం విస్మరించిందని మరి కొందరు నిరసనలకు దిగారు, శ్రీ చౌడయ్య స్వామీజీ, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ శనివారం భారీ నిరసనకు మద్దతు ఇస్తున్నారు. అంజలి కుటుంబం నిరుపేద కుటుంబం అని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు స్వామీజీలు హుబ్బళి-ధారవాడ జంట జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రి సంతోష్ లాడ్ కు మనవి చేశారు. హుబ్బళిలో కాలేజ్ అమ్మాయి నేహా హత్య జరిగి నెల రోజులు కూడా కాకుండానే అంజలి అనే యువతి హత్యకు గురి కావడంతో ఆ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications