పాపం వదిలేయండి: మరదలు ట్విస్ట్, డిగ్గీ పెళ్లి కాదట..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్‌లు త్వరలో వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తల పైన డిగ్గీ కుటుంబ సభ్యులు మరోసారి బుధవారం స్పందించారు.
పాపం.. ఆ పెద్దాయనను వదిలేయండంటూ డిగ్గీ పెళ్లి విషయమై ఆయన సోదరుడి భార్య మరోసారి ట్వీట్ చేశారు. తాను ట్విట్టర్లో ఆ కామెంట్ (పెళ్లి) చేసింది దిగ్విజయ్ సింగ్ గురించి కాదని, తన కజిన్ గురించి అని వివరణ ఇచ్చారు. ఆయన పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతారని, ప్రస్తుతానికి ఆయనను వదిలేయండని, ఆయన దారిన ఆయనను వదిలేయాలన్నారు.

కాగా, దిగ్విజయ్ సింగ్ తన ప్రియురాలు, అమృతా రాయ్‌ని త్వరలో పెళ్లి చేసుకోనున్నారని డిగ్గీ సోదరుడి సతీమణి రెండు రోజుల క్రితం ట్వీట్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే తమ ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయని దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ భార్య రుబినా శర్మ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అది డిగ్గీ పెళ్లి అని ప్రచారం సాగింది.
ఓ టీవీ చానల్లో యాంకర్ అయిన అమృతారాయ్‌తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్టు దిగ్విజయ్ కింగ్ కొద్ది రోజుల క్రితం బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆమెను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు. అమృత, ఆమె భర్త పరస్పర అవగాహనతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, తమ బంధంలో సమస్యలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్ సతీమణి క్యాన్సర్ కారణంగా గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దిగ్విజయ్‌కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.












Click it and Unblock the Notifications