స్కూల్లోకి దూరిన చిరుత పులి: దాడి (పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని చిక్ మగ్ ళూరులో చిరుతపులి కలకలం రేగింది. చిక్‌మగ్‌ళూరులోని ఓ ప్రయివేటు పాఠశాలలోకి చిరుత చొచ్చుకు వచ్చింది. ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

వెంటనే పాఠశాల సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు వచ్చి పాఠశాలను, పాఠశాల భవనాన్ని ఖాళీ చేయించారు. చిరుత పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. చిరుతపులి పాఠశాలలోకి రాగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు పెట్టారు.

పాఠశాల పేరు టిఎంఎస్ స్కూల్. పాఠశాలలోకి చిరుత రావడంతో అందరు షాకై, భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులను ఇళ్లకు పంపించారు.












Click it and Unblock the Notifications