ఆరు నెలలు, 85 సార్లు పురుడు పోశా: నర్సు
గౌహతి: అధికారం చేతిలో ఉండాలి అంతే కాని ఏమైనా చెయ్యవచ్చని ఓ నర్సు నిరూపించింది. ఆరు నెలల్లో తాను 85 సార్లు జన్మినిచ్చానని ఓ నర్సు రికార్డులు సృష్టించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసింది.
అడ్డంగా బుక్ అయిన తరువాత తాను తప్పు చేశానని, క్షమించాలని ఆ నర్సు అంటున్నది. గ్రామీణ ప్రాంతాలలోని వైద్యశాలల్లో పురుడు పోసుకునే తల్లులకు ప్రోత్సహం కింద 500 రూపాయల నగదు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
కరీంగంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లిల్లీ బేగం లస్కర్ నర్సుగా పని చేస్తున్నది. ఈమె పురుడుపోసుకునే తల్లులకు ఇచ్చే ప్రోత్సహకపు నగదు మీద కన్ను వేసింది. గత ఆరు నెలల నుంచి ఈ ఆసుపత్రిలో 160 మంది పురుడు పోసుకున్నారని నకిలి ధ్రువీకరణ పత్రాలు సృష్టించింది.

అందులో ఏకంగా ఆమె పేరుతోనే 85 పురుడు పోసుకున్న కేసులు నమోదు చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించింది. పురుడు పోసుకునే మహిళల కేసుల వివరాలు నమోదు చేసుకునే అధికారం లిల్లీ బేగం చేతిలో ఉండటంతో ఆమె ఇష్టం వచ్చినట్లు వ్యవహరించింది.
ఈ విధంగా దాదాపు రూ. 40 వేలు కాజేసింది. ఈ విషయంపై ఫిర్యాదు వెల్లడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. విచారణలో లిల్లీ బేగం అసలు బండారం బయటపడింది. తాము వెట్టిచాకిరి చేస్తున్నామని తక్కువ జీతాలు రావడం వలనే ఈ విధంగా చేశానని, క్షమించాలని లిల్లీ బేగం లస్కర్ అంటున్నది.












Click it and Unblock the Notifications