రూపాయలు కోటి విరాళం ప్రకటించిన రజినీకాంత్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నదుల అనుసంధానం కోసం రజనీకాంత్ రూ. కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ సోమవారం ప్రకటించారు.
నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన నేపథ్యంలో.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలుపునకు రజనీకాంత్ స్పందించి.. తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారని, ఈ మేరకు రూ.కోటి డిపాజిట్ చేశారని తెలిపారు.
కాగా, ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తూ తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో సత్యనారాయణ పూజలు నిర్వహించారు. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో రజినీకాంత్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications