వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళని బలనిరూపణ: క్షణ క్షణం ఉత్కంఠ, విధ్వంసం, ఇలా జరిగింది(పిక్చర్స్)

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా రెండ్రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి శనివారం ఉదయం 11గంటలకు బలనిరూపణ చేసుకోనున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దాదాపు నెల రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. శనివారం సాయంత్రం అసెంబ్లీలో హైడ్రామా మధ్యనే ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. పళనిస్వామికి 122ఓట్లు లభించడంతో ఆయన విజయం సాధించారు. దీంతో పళనిస్వామి తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

గెలిచి నిలిచిన పళనిస్వామి

గెలిచి నిలిచిన పళనిస్వామి

పళనిస్వామికి 122ఓట్లు లభించడంతో ఆయన విజయం సాధించారు. దీంతో పళనిస్వామి తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
ఆయనకు వ్యతిరేకంగా 11మంది ఓటేశారు. డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు లేకుండానే బలపరీక్ష జరగడం గమనార్హం. సభ ఉదయం 11గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి డీఎంకే నేత స్టాలిన్, పన్నీరు సెల్వం, కాంగ్రెస్ వర్గాల సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఓటింగ్ నిర్వహించి బలపరీక్ష ప్రక్రియ పూర్తి చేశారు స్పీకర్.

స్టాలిన్

స్టాలిన్

మార్షల్స్‌తో డీఎంకే ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ అసెంబ్లీ బయటికి పంపడంతో స్టాలిన్ వారితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేలతో సహా అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు. కాగా తోపులాటలో స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. దీంతో చిరిగిపోయిన చొక్కాను గుండీలు పెట్టుకోకుండానే స్టాలిన్ బయటికి వచ్చారు. అంతకుముందు డీఎంకే అధినేత స్టాలిన్‌ను చర్చలకు పలిచారు స్పీకర్ ధన్ పాల్. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ స్టాలిన్ పట్టుబట్టాడు. ఐదుగురు డీఎంకే ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి తీసుకొచ్చారు.

పన్నీరు వర్గం ఆందోళన

పన్నీరు వర్గం ఆందోళన

ఇది ఇలా ఉండగా, పన్నీరుకు మద్దతుగా ఆయన వర్గం ఎంపీలు అసెంబ్లీకి వెళ్లి ఆందోళన చేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమవడంతోనే సభలో గందరగోళం, విధ్వంసం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినా, డీఎంకే ఎమ్మెల్యేలు సభలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్లు చించివేసి విసిరారు. భారీగా మార్షల్స్ ను మోహరించినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం 3గంటల వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు.

అవమానానికి గురయ్యా, టార్చర్ పెడుతున్నారు: స్పీకర్

అవమానానికి గురయ్యా, టార్చర్ పెడుతున్నారు: స్పీకర్

నేను అవమానానికి గురయ్యానని స్పీకర్ ధన్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ఎమ్మెల్యేలు తన చొక్కా చించేశారని చెప్పారు. సభను సజావుగా సాగేందుకు సహకరించడం లేదని వాపోయారు. తనను విపక్ష ఎమ్మెల్యేలు టార్చరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలని వాపోయారు. ఎమ్మెల్యేలను బయటికి తీసుకెళ్లడంలో మార్షల్స్ విఫలమయ్యారని చెప్పారు.

స్టాలిన్‌కు స్పీకర్ పిలుపు: డీఎంకే ఎమ్మెల్యేల తరలింపు

స్టాలిన్‌కు స్పీకర్ పిలుపు: డీఎంకే ఎమ్మెల్యేల తరలింపు


డీఎంకే అధినేత స్టాలిన్‌ను చర్చలకు పలిచారు స్పీకర్ ధన్‌పాల్. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ స్టాలిన్ పట్టుబట్టాడు. ఐదుగురు డీఎంకే ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి తీసుకొచ్చారు. ఇది ఇలా ఉండగా, పన్నీరుకు మద్దతుగా ఆయన వర్గం ఎంపీలు
అసెంబ్లీకి వెళ్లారు.

సభలో విధ్వంసం

సభలో విధ్వంసం

తమిళనాడు శాసన సభలో గందరగోళం నేపథ్యంలో మీడియా రూమ్ ఆడియోను కట్ చేయడంతో సభలో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. విపక్షాల గందరగోళ మధ్యే ఓటింగ్ జరుగుతోంది. స్పీకర్ పోడియం వద్ద డీఎంకే ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగిస్తున్నారు. బల్లలెక్కి నిరసన తెలుపుతూ, పేపర్లు చించి విసిరేశారు. డీఎంకే ఎమ్మెల్యే అరుణ బెంచిపై ఎక్కి ఆందోళన చేశారు. మైకులను విరిసివేశారు. ఈ క్రమంలో అసెంబ్లీని ఓ అధికారికి గాయాలైనట్లు తెలిసింది.

స్పీకర్‌పై దాడికి యత్నం

స్పీకర్‌పై దాడికి యత్నం

కాగా, స్పీకర్ కుర్చీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతోపాటో స్పీకర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ స్పీకర్‌ను బయటికి తీసుకెళ్లారు. సభను ఒంటిగంట వరకు వాయిదా వేశారు స్పీకర్. కాగా, స్పీకర్ బయటికి వెళ్లడంతో డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే కెకె సెల్వం.. స్పీకర్ కుర్చీలో కూర్చోవడం సంచలనంగా మారింది. సభలో డీఎంకే సభ్యుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్, ముస్లింలీగ్ ఎమ్మెల్యేలు కూడా గందరగోళం సృష్టించారు. సభ వాయిదా పడటంతో ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటికి వచ్చారు.

ఏం చేయాలో నాకు తెలుసు: ఘాటుగా స్పందించిన స్పీకర్

ఏం చేయాలో నాకు తెలుసు: ఘాటుగా స్పందించిన స్పీకర్

నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రొసీడింగ్ ప్రకారం రహస్య ఓటింగ్ కుదరని స్పష్టం చేశారు. సభ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు. సభను ఎలా నిర్వహించాలో తనకు తెలుసు.. నా అధికారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ స్పీకర్ కూడా ఘాటుగానే బదులిచ్చారు.

స్టాలిన్, పన్నీరు ఆగ్రహం

స్టాలిన్, పన్నీరు ఆగ్రహం

రహస్య ఓటింగ్ స్పీకర్ తిరస్కరించడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ వాయిదాకు పట్టుబట్టారు. డీఎంకేకు మద్దతుగా కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు నినాదాలు చేశాయి. సభలో గందరగోళం కారణంగా ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ముందు ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోండంటూ పన్నీరు సెల్వం స్పీకర్‌కు సూచించారు. ఆ తర్వాత బలనిరూపణ చేయాలంటూ డిమాండ్ చేశారు.

 మొదట్నుంచి పళనిదే పైచేయి

మొదట్నుంచి పళనిదే పైచేయి

కాగా, మొదటి రెండు బ్లాకుల్లో పళనిస్వామికి మెజార్టీ దక్కింది. ఒక్కో బ్లాకులో 38మంది సభ్యులు ఉన్నారు. కాగా, మొత్తం 6 బ్లాకుల్లో సాగుతున్న ఓటింగ్. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే యత్నిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో తొందరెందుకని ప్రశ్నించింది. డీఎంకే ఎమ్మెల్యేల గందరగోళంతో అరగంటపాటు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఓటింగ్ కొనసాగిస్తున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను లైవ్ టెలీకాస్ట్ చేసే సాంప్రదాయం తమిళనాడులో లేకపోవడంతో సమావేశం ముగిసన తర్వాతే వీడియోలను విడదుల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 అసెంబ్లీ ప్రారంభమవడంతోనే గందరగోళం

అసెంబ్లీ ప్రారంభమవడంతోనే గందరగోళం

తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమవడంతోనే గందరగోళ వాతావరణం నెలకొంది. తాము నియమించిన విప్ ను మాట్లాడనివ్వాలని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం పట్టుబట్టారు. అయితే, ఇందుకు ఒప్పుకునేది లేదని సీఎం పళని వర్గం తేల్చేసింది. గందరగోళం మధ్యనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు పళనిస్వామి, కాగా, తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీరు డిమాండ్ చేశారు. అంతేగాక, రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేత, డీఎంకే నేత స్టాలిన్, పన్నీరు సెల్వంలు డిమాండ్ చేశారు. అయితే, స్పీకర్ ధన్‌పాల్.. పన్నీరు, స్టాలిన్ డిమాండ్లను తిరస్కరించారు. దీంతో మూజువాణి పద్ధతిలోనే ఓటింగ్‌ జరుగుతోంది. సభ తలుపులు మూసివేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

కరుణానిధి దూరం

కరుణానిధి దూరం

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా రెండ్రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి శనివారం ఉదయం 11గంటలకు బలనిరూపణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన 122 మంది ఎమ్మెల్యేలు భారీ భద్రత మధ్య అసెంబ్లీకి చేరుకున్నారు. కాగా, అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేల వాహనాలపై కొందరు దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతకుముందే సీఎం పళని స్వామి సచివాలయానికి చేరుకున్నారు. స్టాలిన్ తోపాటు 88మంది డీఎంకే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేకపోయారు.

English summary
After ten days of drama, Edappadi Palanisami was sworn in as Chief Minister of Tamil Nadu. He will take the crucial trust vote in the Tamil Nadu legislative assembly in a short while from now. He requires the support of 117 MLAs to pass the test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X