Lockdown: ఏక్కడికి అని అడిగిన పోలీసులనే కత్తితో ఏసేశాడు, లేడీ ఆఫీసర్ మీద దాడి, తీవ్రగాయాలు !

ముంబై: భారత్ లో లాక్ డౌన్ అమలు అయినప్పటి నుంచి ఎక్కడో అక్కడ పోలీసులు, వైద్యులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అర్దరాత్రి ఎక్కడికి వెలుతున్నావ్ ? అని ప్రశ్నించిన పోలీసులపై ఓ యువకుడు పెద్ద కత్తి తీసుకుని ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు, ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులకు కత్తిపోట్లు పడ్డాయి. పోలీసుల మీద కత్తితో దాడి చేసిన యువకుడిని పోలీసులు పట్టుకుని బెండ్ తీస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఒకే బైక్ లో ముగ్గురిని మీరు ఎక్కడికి వెలుతున్నారు అని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్ మీద అల్లరిమూకలు దాడి చేశారు. తీవ్రగాయాలైన పోలీసులకు చికిత్స అందించామని పోలీసు అధికారులు తెలిపారు.

దేశంలో కరోనాలో టాప్

దేశంలో కరోనాలో టాప్

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కరోనా మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అలాంటి మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముంబైలో కరోనా వైరస్ కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది.

అర్దరాత్రి కత్తితో హల్ చల్

అర్దరాత్రి కత్తితో హల్ చల్

శుక్రవారం అర్దరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో మైరన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో సౌత్ ముంబైలోని సిల్వర్ ఓక్స్ ఎస్టేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కరణ్ ప్రదీప్ నాయర్ (27) అనే యువకుడు చేతిలో పెద్ద కత్తి పట్టుకుని నడిరోడ్డు మీద వీర ఆవేశంలో నడుచుకుంటు వెలుతున్నాడు.

ఎక్కడికి అని అడిగితే కత్తితో ఏసేశాడు

ఎక్కడికి అని అడిగితే కత్తితో ఏసేశాడు

కరణ్ ప్రదీప్ నాయర్ ను చూసిన ఇద్దరు పోలీసులు అతన్ని అడ్డగించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కరణ్ ప్రదీప్ నాయర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. చివరికి పోలీసులు వెంటాడి కరణ్ ప్రదీప్ నాయర్ ను పట్టుకున్నారు. ఎక్కడికి వెలుతున్నావ్ ? అని ప్రశ్నించిన ఇద్దరు పోలీసుల మీద కరణ్ ప్రదీప్ నాయర్ కత్తితో దాడి చేశాడు.
విషయం తెలుసుకున్న మైరన్ డ్రైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ సంఘటనా స్థలానికి చేరుకుని చేతులు, భుజంకు తీవ్రగాయాలైన ఇద్దరు పోలీసులను ముంబైలోని జేజే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తల్లితో కొట్లాడి ఇంత చేశాడు

తల్లితో కొట్లాడి ఇంత చేశాడు

కరణ్ ప్రదీప్ నాయర్ ఆర్కిటెక్ (ఇంజనీరింగ్) చదివాడని, తల్లి, చెల్లితో కలిసి నివాసం ఉంటున్నాడని ఇన్స్ పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ చెప్పారు. అర్దరాత్రి తల్లితో గొడవ పెట్టుకున్న కరణ్ ప్రదీప్ నాయర్ తాను ఈ రోజు ఒకరి చంపేస్తానని, వాడి చావు వార్త నువ్వు వింటావని తల్లికి చెప్పి ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని ప్రణేఖ్లాల్ మాఫత్లూల్ హిందూ స్విమ్మింగ్ పూల్ ప్రాంతానికి వచ్చాడని ఇన్స్ పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ మీడియాకు చెప్పారు.

ప్రశ్నించిన లేడీ ఆఫీసర్ పై దాడి

ప్రశ్నించిన లేడీ ఆఫీసర్ పై దాడి

ముంబైలోని అంధేరి ప్రాంతంలోని డీఎన్. నగర్ లో శనివారం ఉదయం ఓ లేడీ ఆఫీసర్ పాలు తీసుకురావడానికి వెలుతున్న సమయంలో ఒకే బైక్ లో అటువైపు ముగ్గురు వెలుతున్నారు. ఆ సమయంలో లాక్ డౌన్ అమలులో ఉంటే మీరు ఎక్కడికి వెలుతున్నారు అని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్ మీద ఆ యువకులు దాడి చేశారని, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+