భారీగా కరోనా కేసులు నమోదు - మళ్లీ మాస్క్ తప్పనిసరి..!!
కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసుల సంఖ్య నమోదు అవుతోంది. గడిచిన 24 గంటల్లో 3,824 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేసారి 27 శాతం మేర కేసుల సంఖ్య పెరగటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు18,389 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మాస్కు వినియోగం తప్పనిసరి చేస్తూ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా కేసులు మరో సారి ఆందోళన కలిగిస్తున్నాయి. కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 5,30,881 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ తో పాటుగా బూస్టర్ డోస్ ల డ్రైవ్ కూడా భారీ ఎత్తున అందించారు. ఇప్పుడు కేరళ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వెంటనే కేసులను గుర్తించటం..చికిత్సా..తీసుకోవాల్సిన చర్యల పైన ఫోకస్ చేయాలని నిర్దేశించింది. కేసుల ట్రాకింగ్ - ట్రేసింగ్ గురించి ప్రత్యేకంగా శ్రద్ద చూపించాలని నిర్దేశించింది. వచ్చే వారం దేశ వ్యాప్తంగా కోవిడ్ సంసిద్దత పైన మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
తమిళనాడు మాస్కు వినియోగం తప్పని సరి చేసారు. ఉత్తర ప్రదేశ్ లో ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రతీ ప్రాంతంలోనూ ముందుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లను గుర్తించేలా పరీక్షల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. ఢిల్లీ, హర్యానా ,కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల విషయంలోనూ కీలక సూచనలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం అయ్యాయి. H3N2 ఇన్ఫ్లెయూంజా కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications