Lokniti-CSDS: అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోడీ.. సర్వేలో వెల్లడి..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. "పబ్లిక్ ఒపీనియన్", లోక్నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) భాగస్వామ్యంతో "పబ్లిక్ ఒపీనియన్"ను నివేదిక విడుదల చేసింది. ఈ నెలలో ప్రధాని మోడీ అధికారంలో తొమ్మిదేళ్లు పూర్తవుతున్నందున, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో సహా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజల మూడ్‌ను అంచనా వేయాలని సర్వే చేపట్టారు. మే 10, 19 మధ్య 19 రాష్ట్రాలలో ఈ సర్వే నిర్వహించారు.
కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినప్పటికీ ప్రధాని మోడీ ప్రజాదరణ బలంగా ఉందని సర్వే పేర్కొంది. పార్టీ ఓట్ల శాతం స్థిరంగా ఉన్నట్లు వివరించింది. దాదాపు 43% మంది బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) వరుసగా మూడోసారి గెలుపొందాలని అభిప్రాయపడ్డారు, అయితే 38% మంది విభేదిస్తున్నారు. ఈరోజు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని దాదాపు 40% మంది చెప్పారు. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు వచ్చాయి.

బీజేపీ ఓట్ల శాతం 2019 (37%) నుంచి 2023 (39%)కి పెరిగింది. అలాగే కాంగ్రెస్‌కు - 2019లో 19% నుంచి 2023లో 29% పెరిగింది.
ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ సరైనవాడని 43 శాతం మంది చెప్పారు. ఆయన సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీ 27 శాతం మంది మద్దతు తెలిపారు. ప్రధానమంత్రికి ప్రముఖ ఎంపిక విషయంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ 4 శాతం మంది మద్దతు తెలపగా.. అఖిలేష్ యాదవ్ 3%, నితీష్ కుమార్ 1 శాతం మంది మద్దతు తెలిపారు.
2019,2023కి సంబంధించిన ప్రధానమంత్రి మోడీకి (44 నుంచి 43%) స్వల్ప తగ్గుదలని కనిపించగా.. రాహుల్ గాంధీకి (24 నుంచి 27%) పెరుగుదల కనిపించింది. 2024లో ప్రధాని మోడీని ఎదుర్కొనే ప్రతిపక్ష నాయకుడు ఎవరని ప్రశ్నించగా.. రాహుల్ గాంధీ పేరును 34% మంది చెప్పగా.. అరవింద్ కేజ్రీవాల్ అని 11 శాతం మంది చెప్పారు. అఖిలేష్ యాదవ్ 5%, మమతా బెనర్జీ అని 4% మంది చెప్పారు. మోడీకి ఎదురు నిలిచేవారు లేరని 9 శాతం మంది చెప్పారు.

ప్రత్యర్థులను వేటాడేందుకు ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని ప్రతిపక్ష ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 37% మంది ఏజెన్సీలు చట్టబద్ధమైనవని చెప్పగా.. 32% మంది రాజకీయ ప్రతీకారానికి ఒక సాధనమని చెబుతున్నారు. లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ 71 నియోజకవర్గాల్లో 7,202 మందిని సర్వే చేసినట్లు తెలిపింది.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications