ఈ రైళ్లు ఎక్కాలంటే బియ్యం, కూరగాయలు, స్టవ్ ఉండాలి!!
భారతదేశానికి రైల్వేలు జీవనాడి వంటివి. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరానికి ప్రజలను చేర్చేది ఇవే. ప్రతి భారతీయుడి జీవన గమనంలో రైలు కూడా ఒకటిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 13వేల రైళ్లు నడుస్తున్నాయి. వీటిద్వారా లక్షలాదిమంది ప్రయాణం చేస్తున్నారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో, సూపర్ ఫాస్ట్, మెయిల్ ఎక్స్ ప్రెస్, వందేభారత్.. ఇలా కొన్ని పేర్లతో చాలాదూరం ప్రయాణిస్తుంటాయి. భారతదేశంలో అత్యంత పొడవైన రైలు మార్గాలు 5 ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.
ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో వివేక్ ఎక్స్ ప్రెస్, హిమసాగర్ ఎక్స్ ప్రెస్ మొదటి స్థానంలో నిలుస్తాయి. ఈ రెండు రైళ్లు దాదాపు 3500 నుంచి 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ప్రతిరోజు మన రైళ్లు 7,325 స్టేషన్లను దాటుతున్నాయి. దూర ప్రాంతాలతోపాటు సబర్బన్ మార్గాల్లో ప్రతిరోజూ 13,169 రైళ్లను నడుపుతోంది. లాంగ్ రూట్, షార్ట్ రూట్ రైళ్లు రెండూ ఉన్నాయి.

వివేక్ ఎక్స్‌ప్రెస్ (నెం. 22504)
ఇది దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తుంది. మొత్తం 4150 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మొత్తం ప్రయాణం 74 గంటల 35 నిముషాలుంటుంది. దేశంలోని 9 రాష్ట్రాలగుండా ఇది ప్రయాణిస్తుంది. 59 స్టేషన్లలో ఆగుతుంది.
కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్‌ప్రెస్ (నెం. 12515)
కోయంబత్తూర్ నుండి సిల్చార్ (ట్రైన్ నెం. 12515) మధ్య నడుస్తుంది. 3492 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మొత్తం 46 స్టేషన్లలో ఆగుతుంది.
హిమసాగర్ ఎక్స్ ప్రెస్ (నెం. 16318)
మాతా వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్. 3787 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 12 రాష్ట్రాల గుండా వెళుతూ 70 స్టేషన్లలో ఆగుతుంది.
మాతా వైష్ణో దేవి మెయిల్ ఎక్స్‌ప్రెస్ (నెం. 16787)
తిరునల్వేలి నుండి కాట్రా వరకు ప్రయాణిస్తుంది. 3,631 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయడానికి 71 గంటల నిముషాలు పడుతుంది. మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications