Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love: డ్రైవర్ తో లేచిపోయిన ఎంబీఏ అమ్మాయి, డెత్ నోట్ రాసి అందరూ ఆత్మహత్య !

బెంగళూరు/చిక్కబళ్లాపుర: కూతురు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి సంబంధం వస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. వ్యవసాయం చేస్తున్న తండ్రి ఆయన కూతురిని ఎంబీఏ చదివించాడు. ఎంబీఏ పూర్తి చేసిన యువతి ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న డ్రైవర్ తో లవ్ లో పడింది. మ్యాటర్ తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. యువతి ఆమె ప్రియుడితో లేచిపోయింది. తక్కువ కులం వాడితో కూతురు లేచిపోయిందని ఆవేదనతో ఆమె తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. యువతి సోదరుడు ఆమెకు వాట్సాప్ లో ఇంటికి రావాలని, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని మెసేజ్ పంపించాడు. అయితే యువతి మాత్రం డోంట్ కేర్ అని చెప్పింది. కూతురి దెబ్బతో ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు పండుగ రోజు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మా ఆత్మహత్యలకు ఎవరు కారణం అని పూర్తి మ్యాటర్ డోత్ నోట్ లో రాసిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

 ఎంబీఏ చదివిన అమ్మాయి

ఎంబీఏ చదివిన అమ్మాయి

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని శిడ్లఘట్ట తాలుకాలోని హండిగనాళ గ్రామంలో శ్రీరామప్ప (67), సరోజమ్మ (58) దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీరామప్ప, సరోజమ్మ దంపతులకు అర్చనా అనే కుమార్తె, మనోజ్ (25) అనే కుమారుడు ఉన్నారు. అర్చనా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి సంబంధం వస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

 డ్రైవర్ ప్రేమలో పడిన ఎంబీఏ అమ్మాయి

డ్రైవర్ ప్రేమలో పడిన ఎంబీఏ అమ్మాయి

వ్యవసాయం చేస్తున్న శ్రీరామప్ప ఆయన కూతురు అర్చనాను ఎంబీఏ చదివించాడు. ఎంబీఏ పూర్తి చేసిన అర్చనా ఆమె నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న డ్రైవర్ నారాయణస్వామితో లవ్ లో పడింది. చాలాకాలం పాటు అర్చనా, నారాయణస్వామి ప్రేమ వ్యవహారం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

 కూతురికి పెళ్లి సంబంధాలు

కూతురికి పెళ్లి సంబంధాలు

అర్చనా కంటే కులంలో నారాయణస్వామి కులంలో తక్కువవాడు. కులంతో పాటు ఆస్తి అంతస్తులో నారాయణస్వామి తక్కువ వాడు అని తెలిసినా అర్చనా అతని వెంటతిరిగింది. అర్చనా లవ్ మ్యాటర్ తెలుసుకున్న ఆమె తండ్రి శ్రీరామప్ప, ఆయన బంధువులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

 ప్రియుడితో జంప్

ప్రియుడితో జంప్

పెళ్లి సంబంధాలు రావడంతో అర్చనా ఆమె ప్రియుడ నారాయణస్వామితో లేచిపోయింది. తక్కువ కులం వాడు అయిన నారాయణస్వామితో కూతురు అర్చనా లేచిపోయిందని ఆవేదనతో ఆమె తల్లిదండ్రులు శ్రీరామప్ప, సరోజమ్మ దంపతులు కొన్ని రోజుల ఇంటి నుంచి ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు.

 ఒకే ఫ్యామిలీలో అందరూ ఆత్మహత్య

ఒకే ఫ్యామిలీలో అందరూ ఆత్మహత్య

అర్చనాకు ఆమె సోదరుడు మనోజ్ ఇంటికి రావాలని, లేదంటే మేము అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు. అయితే అర్చనా మాత్రం డోంట్ కేర్ అని చెప్పింది. అర్చనా మా పరువు తీసిందని ఆమె తల్లిదండ్రులు శ్రీరామప్ప, సరజోమ్మతో పాటు సోదరుడు మనోజ్ దసరా పండుగ రోజు ఒకేసారి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 డెత్ నోట్ కలకలం

డెత్ నోట్ కలకలం

తక్కువ కులం వాడితో లేచిపోయి ఊరిలో మేము తల ఎత్తుకుని తిరగకుండా చేసిన అర్చనా, ఆమె ప్రియుడు నారాయణస్వామి మా ఆత్మహత్యలకు కారణం అని అర్చనా తండ్రి డోత్ నోట్ లో రాశాడని, తరువాత ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు అన్నారు. ప్రియుడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న అర్చనా మాత్రం కుటుంబ సభ్యుల అంత్యక్రియులకు వస్తుందో లేదా అని ఆమె బంధువులు వేసి చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+