ప్రియుడు నాన్ వెజ్ వద్దన్నాడని..ఎయిర్ ఇండియా మహిళా పైలట్ ఆత్మహత్య ?
ముంబైలో పాతికేళ్ల మహిళా పైలట్ సృష్టీ తులీ ఆత్మహత్య వ్యవహారం ఎయిర్ ఇండియాలో తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న సృష్టీ తులీని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు. అయితే ఆమె ప్రియుడు ఆదిత్య పండిట్ నాన్ వెజ్ తినే విషయంలో ఓ ఈవెంట్ లో చేసిన అవమానం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులిని ఆమె ప్రియుడు ఆదిత్య పండిట్ తరచూ తిడతాడని పోలీసులు గుర్తించారు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేల్చారు. గురుగ్రామ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాంసాహారం తిన్నందుకు ఆదిత్య ఆమెను ఇతరుల ముందు అవమానించాడని పోలీసులు తెలిపారు. వారి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆదిత్య ఆమెను మధ్యలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం పని ముగించుకుని తిరిగి వచ్చిన సృష్టి తన ఇంట్లో ఉన్న ఆదిత్యతో గొడవపడింది. ఆ తర్వాత అతను సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఢిల్లీకి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో సృష్టి అతనికి ఫోన్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని గుర్తించారు. దీంతో ఆదిత్య తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. ఆదిత్య కీ మేకర్ సహాయంతో తాళం పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సృష్టిని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications