Lovers: ప్రియుడితో కొత్త పెళ్లికూతురు జంప్, 10 రోజులకే భర్తకు ?, ఆస్తులు బూడిద, !
చెన్నై/సేలం: యువతికి ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయిని చూసి 10 రోజుల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. వారం రోజుల నుంచి కొత్త పెళ్లి కూతురు ఆమె భర్తతో గొడవలు పడుతోంది. రోజూ నవదంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సాయంత్రం ఇంటి బయట ఉన్న కొత్త పెళ్లికూతురు ఆమె ప్రియుడితో పారిపోయింది. అర్దరాత్రి వరకు కొత్త పెళ్లికూతురి కోసం వెతికారు. ప్రియుడు కూడా మాయం అయ్యాడని కొత్తపెళ్లికూతురి కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రియుడి ఇంటి మీద దాడి చేసిన కొత్తపెళ్లికూతురు కుటుంబ సభ్యులు రెండు ఇండ్లు ద్వంసం చేసి లక్షల రూపాయల విలువైన నాలుగు వాహనాలకు నిప్పంటించడం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో లవర్స్
తమిళనాడులోని సేలం జిల్లాలోని కడైయంబట్టి సమీపంలోని మరకోటైలో మారిముత్తు అనే ఆయన నివాసం ఉంటున్నాడు. మారిముత్త ఇంటి సమీపంలోనే మాణిక్యం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మారిముత్త కుమారుడు అజిత్ కుమార్ (23), మాణఇక్యం కుమార్తె పూర్ణిమా (21) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

ప్రియుడు వద్దని కొత్త పెళ్లికొడుకును తెచ్చారు
ఒకే ఏరియాలో ఉంటున్న పూర్ణిమా, అజిత్ కుమార్ మాట్లాడుకుంటుంటే చాలాకాలం ఎవ్వరికి అనుమానం రాలేదు, అయితే కొన్ని నెలల క్రితం అజిత్ కుమార్, పూర్ణిమాల లవ్ స్టోరీ అందరికి తెలిసిందిపోయింది. అజిత్ కుమార్ కు పూర్ణిమాను ఇచ్చి పెళ్లి చెయ్యడం ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారు.

ప్రియురాలికి పెళ్లి....విషం తాగేసిన ప్రియుడు
పూర్ణిమాకు ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయిని చూసి 10 రోజుల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. పూర్ణిమా పెళ్లి జరిగిన రోజే ఆమె ప్రియుడు అజిత్ కుమార్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అజిత్ కుమార్ ఇటీవల ఇంటికి వచ్చాడు. ప్రియుడు అజిత్ కుమార్ ను మరిచిపోలేని పూర్ణిమా ఆమె భర్తతో గొడవలు పడుతోంది.

ప్రియుడితో కొత్తపెళ్లి కూతురు జంప్
రోజూ నవదంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పూర్ణిమాకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చచెప్పినా ఆమె ఎవ్వరిమాట వినలేదు. సాయంత్రం ఇంటి బయటకు వెళ్లిన కొత్త పెళ్లికూతురు పూర్ణిమా ఆమె ప్రియుడు అజిత్ కుమార్ తో కలిసి పారిపోయింది. అర్దరాత్రి వరకు కొత్త పెళ్లికూతురు పూర్ణిమా కోసం ఆమె కుటుంబ సభ్యులు వెతికారు.

ప్రియుడి మీద పగ...... ప్రతీకారంతో
పూర్ణిమాతో పాటు ఆమె ప్రియుడు అజిత్ కుమార్ కూడా మాయం అయ్యాడని కొత్తపెళ్లికూతురి కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రియుడు అజిత్ కకుమార్ ఇంటి మీద దాడి చేసిన కొత్తపెళ్లికూతురు పూర్ణిమా కుటుంబ సభ్యులు ప్రియుడి కుటుంబ సభ్యులకు చెందిన రెండు ఇండ్లు ద్వంసం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన రూ. లక్షల రూపాయల విలువైన మిని లారీ, ట్రాక్టర్, జీపు, బైక్ లకు, గడ్డివాముకు నిప్పంటించారు

అమ్మాయి కుటుంబ సభ్యులు ఎస్కేప్
మంటలు వ్యాపించి అజిత్ కుమార్ తల్లి తంగమణి (42)కి గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు అజిత్ కుమార్ ఇంటి దగ్గర, ఆ ప్రాంతంలో సేలం జిల్లా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణిమా కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు కావడంతో అందరూ పరారైనారు.












Click it and Unblock the Notifications