ఇన్‌స్టా ఫ్రెండ్‌షిప్: ఏడో తరగతి బాలికపై 2 రోజుల పాటు గ్యాంగ్-రేప్!
Lucknow Crime: ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారాయో నిరూపించే ఓ హృదయ విదారక ఘటన లక్నోలో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని కలవడానికి వెళ్లిన ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లక్నోలోని ఓ హోటల్ గదిలో రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇన్‌స్టా స్నేహం.. పీడకలగా మారిన 'జాయ్‌రైడ్'
బాధితురాలి తల్లి సరోజిని నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆ మైనర్ బాలిక విమల్ యాదవ్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం పెంచుకుంది. కొద్దికాలంలోనే వారి మధ్య చాటింగ్‌లు, ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. నవంబర్ 2వ తేదీన విమల్ యాదవ్ బాలికను బయట కలిసేందుకు పిలిచాడు. అతడిని నమ్మి బాలిక బయటికి వెళ్లగా.. విమల్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు పీయూష్ మిశ్రా, శుభం శుక్లా - స్కోర్పియో ఎస్‌యూవీలో సిద్ధంగా ఉన్నారు. సరదాగా జాయ్‌రైడ్‌కు వెళ్దామని నమ్మబలికి బాలికను ఎస్‌యూవీలోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత వారు ఐఐఎం రోడ్డులోని ఒక హోటల్‌కి తీసుకెళ్లి రూమ్ తీసుకున్నారు.

బెదిరింపులతో తీవ్రంగా దాడి
హోటల్ గదిలోకి వెళ్లగానే నిందితులు తమ నిజస్వరూపం చూపారు. ఆ నిందితులు బాలిక ఫోన్‌ను లాక్కున్నారు, ఆమెను రెండు రోజుల పాటు గదిలోనే బంధించారు. ఈ సమయంలో వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక లైంగిక దాడిని ప్రతిఘటించగా.. నిందితులు ఆమెను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా దాడికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ దారుణం తర్వాత, రెండు రోజుల అనంతరం నిందితులు బాలికను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. తన కూతురు తీవ్ర భయాందోళనతో ఉందని.. అసలు విషయం చెప్పడానికి కూడా భయపడి కుప్పకూలిపోయిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో పీయూష్, శుభంలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బాలికను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసిన ప్రధాన నిందితుడు విమల్ యాదవ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
సోషల్ మీడియా భద్రత
ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలను మరోసారి హెచ్చరించింది. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిఘా ఉంచాలి. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు స్నేహితులుగా పరిచయమై వ్యక్తిగత సమాచారం సేకరిస్తే అప్రమత్తంగా ఉండాలని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ఆన్‌లైన్ పరిచయాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బయట కలవకూడదని లేదా ఎవరితోనూ రైడ్‌లకు వెళ్లకూడదని గట్టిగా సూచించాలి. పిల్లలు ఏదైనా ఇబ్బంది లేదా వేధింపులకు గురైతే, శిక్ష పడుతుందనే భయం లేకుండా తల్లిదండ్రులకు వెంటనే తెలియజేసేలా ప్రోత్సహించాలి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications