యువకుడి మెడకు బెల్టు కట్టి చిత్రహింసలు: నిందితులపై ఎన్ఎస్ఏ కేసులు, ఇంటి కూల్చివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‍లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి.. కుక్కలా మొరగమంటూ కొందరు దాడిచేస్తూ.. చిత్రహింసలకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించింది.
ఆ వీడియోలో ఫైజల్, బిలాల్, సమీర్ ఖాన్, ముఫిద్, సాహిల్ అనే కొందరు యువకులు.. విజయ్ అనే యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి వేధింపులకు పాల్పడ్డారు. కుక్కలా మొరగమంటూ హింసించారు. అంతేగాక, నిందితులు బాధిత యువకుడి తల్లి, సోదరిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. బాధితుడి సోదరిని రేప్ చేస్తామంటూ నిందితులు బెదిరించారు. ఒకవైపు వారు తిడుతుంటే.. తాను ఏ తప్పూ చేయలేదని బాధితుడు చెబుతుండటం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.

ఈ ఘటనను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని, 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని భోపాల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు మీడియాకు మంత్రి తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Bhopal, MP| I saw that video. I felt like it is a grievous incident. Such a behavior towards a human being is highly condemnable. I have instructed Bhopal Police Commissioner to probe this incident and take action within 24 hours: Narottam Mishra, MP Home Minister, on a viral… pic.twitter.com/wdYk9jMPmF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 19, 2023
నిందితులు బెదిరించి.. తన రెండు ఫోన్లను తీసుకున్నట్లు బాధితుడు విజయ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను భయంతో మౌనంగా ఉన్నానని.. కానీ, వారి వేధింపులతో విసిగిపోయానని చెప్పాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
Madhya Pradesh | Three accused in police custody for allegedly brutally thrashing a youth in Bhopal. pic.twitter.com/nn5nZDT2oI
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 19, 2023
కాగా, నిందితులపై పోలీసులు ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసులు నమోదు చేశారు. అంతేగాక, నిందితుడు సమీర్ ఖాన్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ వ్యవహారంలో అపహరణ, బలవంతపు మత మార్పిడి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలో నేర చరిత్ర కలిగిన ముగ్గురు సహా ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేర చరిత్ర కలిగిన ముగ్గురు నిందితులపై ఎన్ఎస్ఏ ప్రయోగించబడిందని భోపాల్ పోలీసులు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications