ఎంపి పోల్స్: టికెట్లపై గుర్రు, ఎంపి మీనాక్షి నిర్బంధం

Meenakshi Natarajan
ఇండోర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహితురాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండసోర్ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నీముచ్ జిల్లాలోని జవాద్ శాసనసభ నియోజక వర్గం నుంచి రాజ్‌కుమార్ అహిరికి పార్టీకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఆయన మద్దతుదారులు ఇండోర్‌కు వచ్చిన నటరాజన్‌ను ఓ గదిలో బంధించి తాళం వేశారు.

ఇండోర్ పర్యటనకు వచ్చిన ఎంపి మీనాక్షి నటరాజన్‌ను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. మీనాక్షి, రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాధిత్య సింధియాపై వారు మండిపడ్డారు. ప్రచార సారథి శాసనసభ ఎన్నికల్లో టెకెట్ల కేటాయింపులో పక్షపాతం చూపించారని వారు ఆరోపించారు.

నీముచ్ నియోజక వర్గం నుంచి 2008 ఎన్నికల్లో 20వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన రఘురాజ్ చోర్డియాకు టికెట్ ఇచ్చి తమ నేత రాజ్‌కుమార్ అహిరికి టికెట్ నిరాకరించడం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధియా, నటరాజన్ వల్లే తమ నాయకుడు రాజ్‌కుమార్ అహిరికి టికెట్ రాలేదని వారు ఆరోపించారు.

కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సారథి సింధియా, మీనాక్షి నటరాజన్ వల్లే శాసనసభ ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని ఆ పార్టీ నేత రాజ్‌కుమార్ అహిరి మీడియాకు తెలిపారు. తను 2008 శాసనసభ ఎన్నికల్లో జవాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 4,700 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు తెలిపారు. 24 గంటల్లోగా పార్టీ టికెట్ ఇవ్వకపోయినట్లయితే తను స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు రాజ్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+