Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం: అన్యమతస్తులు, నాస్తికులకు నో ఎంట్రీ: హైకోర్టు ఆదేశం

Palani Temple: పళని ఆలయం. తమిళనాడులోని ప్రఖ్యాత దేవస్థానాల్లో ఇదీ ఒకటి. సుబ్రహ్మణ్యస్వామివారు కొలువైన అరుదైన ఆలయం ఇది. మురుగన్‌గా, దండాయుధపాణిగా స్వామివారిని కొలుస్తారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వేలాదిమంది సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకుంటుంటారు.

దిండిగల్ జిల్లాలో గల ఈ ఆలయంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. హిందువులకు మాత్రమే ఈ ఆలయంలో ప్రవేశాన్ని కల్పించింది. హిందుయేతరులు ఆలయానికి వెళ్లడంపై నిషేధం విధించింది. హిందూ ధర్మం అంటే నమ్మకం లేని వాళ్లు, నాస్తికులకు ఆలయంలోనికి వెళ్లడం సరికాదని తేల్చి చెప్పింది.

Madras High Court ruled that non-Hindus are prohibited from entering the Palani temple

నాస్తికులకు ఆలయ ప్రవేశం లేదని స్పష్టం చేసింది. దైవం పట్ల భక్తి భావం లేనివారికీ ఈ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు వినిపించింది. ఈ తీర్పు పట్ల మెజారిటీ హిందువులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. దీన్ని స్వాగతిస్తోన్నారు.

దేవుడంటే నమ్మకం లేని వాళ్లు ఆలయానికి వెళ్లడం సరికాదంటూ పళనికి చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రోజూ పళని ఆలయాన్ని దర్శించడానికి వేలాదిమంది వస్తుంటారని, హిందుయేతరులు ఉంటోన్నారని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. హిందుయేతరుల వల్ల భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. వారి రాకపై నిషేధం విధించాలని, ఆలయం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Madras High Court ruled that non-Hindus are prohibited from entering the Palani temple

ఆయన తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి.. ఏకీభవించారు. పిటీషనర్‌కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చారు. హిందూయేతరులు ఆలయంలో ప్రవేశించడం సరికాదని పేర్కొన్నారు. ఒకవేళ వారు ఆలయంలోనికి వెళ్లినా.. ధ్వజస్తంభం దాటి వెళ్లకూడదని సూచించారు. దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

అన్యమతస్తులు గుడి లోనికి ప్రవేశించాలనుకున్నా, స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నా ఆలయంలో ఓ రిజిస్టర్ ఉంచాలని, దేవుడి మీద విశ్వాసంతోనే తాను దర్శనం చేసుకుంటున్నట్లు హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందనీ అన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఆగమ నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+