పట్టపగలు... నడిరోడ్డుపై దారుణ హత్య... ఉలిక్కిపడ్డ మధురై...

తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ గ్యాంగ్ ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చింది. అతని తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో ఈ దృశ్యాలను చిత్రీకరించడంతో... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మధురై ఉలిక్కిపడింది.

పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఊతంగడికి చెందిన మురుగానందం(22) సోమవారం(నవంబర్ 16) తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. నిత్యం రద్దీగా ఉండే కిజావసల్ ప్రాంతంలోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా... కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు అతన్ని అడ్డగించారు.ఈ క్రమంలో మురుగానందం పారిపోయేందుకు యత్నించగా.. ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి మరీ హత్య చేసింది. మురుగానందం తల నరికి సమీపంలోని చర్చి ముందు విసిరేసింది.

Madurai man beheaded on road by armed gang, killing recorded on video

ఆ గ్యాంగ్ దాడిలో మురుగానందం స్నేహితుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. మురుగానందరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక మరేవైనా కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+