రేపటితో ఎండ్ కార్డ్

Mahakumbh 2025: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు.

ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లను దాటింది కూడా. సోమవారం నాటికి 62 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉదయం 8 గంటల వరకు 31 లక్షలమంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. భక్తుల తాకిడికి ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది.

Mahakumbh 2025 Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj

కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియబోతోంది. ఇంకొక్కరోజే మిగిలివుంది మహా కుంభమేళా సమాప్తి కావడానికి. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. త్రివేణి సంగమం జనసంద్రంగా మారుతోంది.

నేడు, రేపు కనీసం రెండు కోట్లమందికి భక్తులు పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా శివరాత్రి నాడు మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తోన్న నేపథ్యంలో అఘోరీలు, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమానికి రానున్నారు.

Mahakumbh 2025 Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj

మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.

భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్‌తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+