మహారాష్ట్ర: 162 ఓట్లతో నెగ్గిన ఎంఐఎం అభ్యర్థి, ఒవైసీ అభినందనలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా పోటీ ఇవ్వలేదనే చెప్పాలి. మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 234 స్థానాల్లో విజయం నమోదు చేసింది. ఇక, కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ థాక్రే)-ఎన్సీపీ (శరద్ పవార్) కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమైంది. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. మాలేగావ్ సెంట్రల్ స్థానంలో కేవలం 162 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలిక్ విజయం సాధించారు. ఖాలిక్‌కు 1,09,653 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి ఆసిఫ్ షేక్ రషీద్‌కు 1,09,491 ఓట్లు వచ్చాయి. కాగా, మహారాష్ట్రలో ఎంఐఎం 16 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్కస్థానంలో విజయం నమోదు చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ముఫ్తీ ఖాలిక్ మాలేగావ్ సెంట్రల్ స్థానం నుంచి విజయం సాధించడం పట్ల ఎంఐంఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. ముఫ్తీకి ఒవైసీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండవసారి మాలెగావ్ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ముఫ్తీ ఇస్మాయిల్ సాహెబ్‌కు అభినందనలు అని ఎక్స్ వేదికగా ఒవైసీ పేర్కొన్నారు .

నాందేడ్ ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. బీజేపీ అభ్యర్థి సంతుక్ రావ్ హంబార్డే, కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్ రావ్‌ల మధ్య కేవలం వందల ఓట్ల తేడా కనిపించింది. రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ ఆధిక్యం పెరగడం తగ్గడం జరిగింది. ఒకానొక స్థాయిలో కేవలం 400 ఓట్ల తేడా మాత్రమే కనిపించింది.
మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ అభ్యర్థి సంతుక్ రావ్.. చివరి రౌండ్లలో వెనుకబడిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వంతరావ్ హంబార్డే కేవలం 1,457 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. చవాన్ రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా.. సమీప బీజేపీ అభ్యర్థి సంతుక్ రావు కు 585,331 ఓట్లు వచ్చాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications