వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో ఔషధాలు: స్నాప్‌డీల్ సీఈఓపై కేసు నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే అమ్మాల్సిన ఔషధాలను ఆన్‌లైన్‌లో అమ్ముతున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్ డీల్, ఆ సంస్ధ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ భల్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

మహారాష్ట్ర ఎఫ్ డీఏ (పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఈ కేసును దాఖలు చేసింది. ఆన్‌లైన్ తరహా అమ్మకాలను నిలిపివేయాలని స్నాప్‌డీల్‌‌కు గతంలో నోటీసులు జారీ చేశామని, అయినా సంస్ధ స్పందించడం లేదని ఎఫ్‌డీఏ కమిషనర్ హర్షదీప్ కాంబ్లీ వ్యాఖ్యానించారు.

Maharashtra FDA files FIR against Snapdeal CEO, directors

మరోవైపు ఆన్‌లైన్ వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీలైన ప్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్ధలు కూడా ఈ తరహా అమ్మకాలు సాగిస్తున్నాయా? అనే విషయంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌డీఏ కమిషనర్ ఆదేశాల మేరకు 1954 నాటి డ్రగ్స్ అండ మ్యాజిక్ రెమిడీస్, 1945 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది ఇలా ఉంటే గత నెలలో స్నాప్‌డీల్ గోడౌన్స్‌పై ఎఫ్‌డీఏ అధికారులు దాడులు జరపగా, పెద్ద మొత్తంలో ఓషధాలు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

English summary
Maharashtra’s Food and Drug Administration (FDA) on Friday filed a First Information Report (FIR) against Snapdeal Chief Executive Kunal Bahl and the company’s directors at the Panvel police station in Raigad district, in connection with the sale of prescription drugs online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X