భారత్ లోనూ పెరుగుతున్న కోవిడ్ కేసులు - రెండు మరణాలు..!!

కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాసియాలో విస్తరిస్తోంది. క్రమేణా కేసుల సంఖ్య పెరుగు తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ కేసులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా వెలుగు లోకి రావటంతో ఆందోళన మొదలైంది. కాగా.. దేశంలో కొవిడ్‌ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

భారత్ లోనూ కోవిడ్ కేసులు బయట పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్ర లో ఏకంగా వందకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

maharashtra-has-reported-two-covid-19-related-deaths-since-january

కాగా, జనవరి నుంచి రెండు కొవిడ్‌ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్‌ రోగి అని పేర్కొంది. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగుల తోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. ఇక.. సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్‌ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్‌ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్‌లో నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని సింగపూర్‌ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+