• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతు విధ్వంసం: ఆతి విశ్వాసమే కొంప ముంచిందా?

By Swetha Basvababu
|

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను 'కిసాన్ పుత్రుడి (రైతు కొడుకు)నని చెప్పుకుంటారు. ఒక ర్యాలీ తర్వాత మరొక ర్యాలీలో ఆయన పదేపదే చెప్తుంటారు రైతుల బాధ తన బాధేనని చెప్తుంటారు.

కానీ ఉల్లిగడ్డ రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా శివరాజ్ సింగ్ చౌహాన్ తోసిపుచ్చుతూ వస్తున్నది. ఆందోళన బాట పట్టిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తమ ఉత్పత్తులను రోడ్డుపై పారబోశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సూక్ష్మబుద్ధిగల రాజకీయ నాయకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజల నాడిని గమనించడంలో విఫలమయ్యారు. రైతుల ఆందోళనకు కారణమేమిటో కనిపెట్టడంలో విఫలం అయ్యారు. రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టిన తొలి రోజు నుంచి ఎదురుదాడి వ్యూహం అమలులోనే నిమగ్నమైంది. సీనియర్ బీజేపీ నేతలు, మంత్రులు ప్రారంభం నుంచి రైతుల ఆందోళనను కొట్టిపారేస్తూ వచ్చారు.

రైతుల ఆందోళన పెరిగి, దాని ప్రభావం తమపై నేరుగా పడే వరకు గుర్తించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. రైతులు పాలను, కూరగాయలను రోడ్లపై పారబోయడంతో వాటి ధరలు ఆకాశాన్నంటిన తర్వాత.. నగరాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారిన తర్వాత గానీ వాస్తవ పరిస్థితి ఏమిటన్నది బోధ పడలేదు.

కట్టలు తెంచుకున్న అన్నదాత ఆగ్రహం

కట్టలు తెంచుకున్న అన్నదాత ఆగ్రహం

అయినా ఆందోళన తీవ్రతను తక్కువ చేసి చూపడానికే అధికార పార్టీ నేతలు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ఆందోళన విస్తరిస్తూ వచ్చింది. ఆందోళనకారులు పాల ట్యాంకులను రోడ్లపైనే ఖాళీ చేశారు. కూరగాయలు డంపింగ్ యార్డుల్లో పారబోసి తమ నిరసనను తెలియజేసినా అధికార పక్షానికి చీమ కుట్టినట్లయినా లేకపోయింది. ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన మరింత ఉద్రుతం చేయక తప్పింది కాదు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. హింసాత్మక చర్యలకు దిగిన తర్వాత గానీ ప్రభుత్వం కళ్లు తెరవని పరిస్థితి నెలకొన్నది. మీడియా ఎప్పటికప్పుడు రైతుల ఆందోళనను ప్రభుత్వం ద్రుష్టికి తెస్తూనే వచ్చింది. అయినా బీజేపీ సీనియర్ నేతలు ఈ ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చేరి ఉన్నాయన్న ప్రచారాన్ని ముందుకు తెచ్చారు.

ఇలా రైతులపై పోలీసుల కాల్పులు

ఇలా రైతులపై పోలీసుల కాల్పులు

ఇదే సమయంలో మహారాష్ట్రలోనూ రైతులు ఆందోళన బాట పట్టారు. కానీ మరాఠీ రైతులు విడివిడిగా ఆందోళనకు దిగడంతో దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హామీలతో కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన విరమించాయి. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చివరి దశలో ప్రభుత్వం ఆందోళన విరమింపజేసేందుకు విఫలయత్నాలు చేసింది. సోమవారం నుంచి బీజేపీ మద్దతు గల యూనియన్ ఆందోళన నుంచి వైదొలిగినా నిరసన కొనసాగింది. వందల మంది రైతులు హింసాత్మక ఆందోళనకు దిగడంతో పోలీసులు నేరుగా వారిపై కాల్పులు జరిపారు.

మొక్కుబడిగా కాల్పులపై విచారణకు ఆదేశం

మొక్కుబడిగా కాల్పులపై విచారణకు ఆదేశం

కానీ మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాత్రం రైతులపై పోలీసులు కాల్పులు జరుపలేదని నమ్మబలికారు. మరి రైతులను పొట్టన బెట్టుకున్నదెవ్వరన్న ప్రశ్న తలెత్తుతున్నది. దీన్ని దాట వేసేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ మూసేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని వివిధ జిల్లాల రైతులు ఇప్పటికి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్ జయప్రదంగా ముగిసింది. కానీ ప్రభుత్వం తన పొరపాట్లను అంగీకరించేందుకు గానీ, సరిదిద్దుకునేందుకు గానీ నిరాకరించింది. రైతులు తమ ఆందోళన విరమించడానికి సిద్ధంగా లేరు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. దీనికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించారు. రైతుల ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని విమర్శలకు దిగారు.

చౌహాన్ ను వెంటాడనున్న చేదు అనుభవం

చౌహాన్ ను వెంటాడనున్న చేదు అనుభవం

రైతుల సమస్య పట్ల ప్రభుత్వం అనుసరించిన ఉదాసీనత వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్ది రోజులుగా ప్రతి దశలోనూ ప్రభుత్వం, అధికార బీజేపీ నేతలు.. రాజకీయ పార్టీల నాయకులు తప్ప నిజమైన రైతులు ఆందోళనలో పాల్గొనడం లేదని పదేపదే మీడియా ముందుకు ప్రకటించి ఆందోళనను తక్కువ చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నదన్న ధైర్యంలో రైతుల ఆందోళనను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏడాదితో 11 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రైతుల ఆందోళన చేదు అనుభవం వెంటాడనున్దని.

అస్త్రంగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం

అస్త్రంగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం

దీనికి తోడు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అంశంపై బయట పడ్డ ‘వ్యాపం' కుంభకోణంపై ఇప్పటివరకు శివరాజ్ సింగ్ చౌహాన్ అతిపెద్ద పోరాటం జరిపారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించిన తర్వాత విచారణ నెమ్మదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ‘వ్యాపం' కుంభకోణాన్ని ప్రధాన సమస్యగా రూపొందించడంలో విఫలమైందన్న విమర్శ వచ్చింది. ఏది ఏమైనా రాష్ట్రంలో భారీగా ఉన్న రైతుల్లో అసంత్రుప్తి శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా పరిణమించింది.

 క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధం

క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధం

వరుసగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రుషి కర్మాన్ అవార్డులు అందుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని తాజా రైతుల ఆందోళన బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు వారి దరి చేరలేదని అర్థమవుతున్నది. మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీపై భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్నది. ఆందోళన కరమైన ఈ అసంత్రుప్తి నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎలా బయట పడతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Madhya Pradesh chief minister Shivraj Chouhan calls himself ‘Kisan Putr’ (farmer’s son). In rallies after rallies, he repeats it and says that farmers' pain is his pain. But for days, when farmers were protesting across the state, his government remained in denial. The farmers were agitating, throwing agricultural produce on the roads and confronting the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more