భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బందెపార-కోరన్ జోడ్ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డు దళం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జవాన్ల కాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఈ మేరకు వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఐదు మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.
బీజాపూర్‌లో డీఆర్జీ, జిల్లా దళం నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఐదుగురు నక్సలైట్లు(ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు) మృతి చెందారు. ఇది భద్రతా దళాలకు భారీ విజయం. బస్తర్ ప్రాంతంలో త్వరలో శాంతి నెలకొంటుంది అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అన్నారు.
Raipur, Chhattisgarh: On the Bijapur Naxal encounter, Deputy CM Vijay Sharma says, "On the Bijapur-Madded area, a joint operation was conducted by Bastar Fighters and DRG personnel. Five Naxals were apprehended, including three male and two female Naxals. The soldiers have… pic.twitter.com/OTFo3j46V8
— IANS (@ians_india) January 12, 2025
మరోవైపు, నారాయణ్‌పూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలు సోన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి హిర్గేనార్ అటవీ ప్రాంతంలో భారీ ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications