రఘువీరారెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు: ఏపీ, తెలంగాణ నేతలు వీరే..!!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. సమాయాత్తమౌతోంది. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని మట్టికరిపించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంటోంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎన్డీఏకు ఇవ్వకూడదనే పట్టుదలతో ఉంది.

ఈ క్రమంలో- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 30 మందితో కొత్త సీడబ్ల్యూసీని ఏర్పాటు చేసింది. అలాగే- ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కూడిన జాబితాను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

Mallikarjun Kharge

మొత్తం 30 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డాక్టర్ మన్మోహన్ సింగ్, అధిర్ రంజన్ చౌధరి, ఏకే ఆంటొని, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పీ చిదంబరం, ముకుల్ వాస్నిక్,ఆనంద్ శర్మ, అశోక్ రావ్ చవాన్, అజయ్ మాకెన్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కుమారి సెల్జా, శశిథరూర్, అభిషేక్ మను సింఘ్వి.. ఇందులో ఉన్నారు.

Mallikarjun Kharge

ప్రధాన కార్యదర్శులు, శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది చొప్పున అపాయింట్ చేసింది. మరో తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, నలుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే.

ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డికి.. సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు ఖర్గే. వివాదరహితుడిగా గుర్తింపు ఉన్న ఆయన సేవలను ఇకపై పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఖర్గే- రఘువీరారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఏపీకి చెందిన మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజును కూడా పార్టీలో కీలక పదవిని అప్పగించింది. ఆయనను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికీ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చోటు కల్పించింది. శాశ్వత ఆహ్వానితుల టీమ్‌లో టీ సుబ్బరామిరెడ్డి, కే రాజు, దామోదర రాజనర్సింహలను తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+