రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంలో ''కుర్చీ'' వివాదం... వెంకయ్యనాయుడి స్పందనపై..
భారతదేశానికి నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అతిరథ మహారధులంతా హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు కేటాయించిన సీటుపై వివాదం తలెత్తింది. ఆయనకు తగిన సీటు కేటాయించకుండా అవమానించారంటూ ప్రతిపక్షాలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశాయి.

వెంకయ్యనాయుడికి లేఖ
ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారంలో ఖర్గేకు కేబినెట్ మంత్రుల పక్కనే మొదటివరుసలో సీటు కేటాయించారు. అయితే ఆ సీటు మూలన ఉండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే కు మూలన సీటు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు వెంకయ్యకు లేఖ రాశాయి. ప్రొటోకాల్ పాటించకుండా సీనియర్ నేతను అవమానించారని ఆరోపించాయి.

అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి..
ప్రతిపక్షాలు చేసిన ఆరోపణను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము ప్రొటోకాల్ ను ఉల్లంఘించలేదని, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రులందరి తర్వాత సీటును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ నిబంధనను కచ్చితంగా పాటిస్తే ఖర్గేకు మూడోవరుసలో సీటు వస్తుందని, కానీ ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి మొదటి వరుసలో కూర్చోబెట్టామన్నారు. ఆ సీటు మూలన ఉందంటూ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా మధ్యలో కూర్చోమని సిబ్బంది చెప్పారని జోషి వెల్లడించారు. అందుకు ఖర్గే ఒప్పుకోలేదని తెలిపారు.

రామ్ నాథ్ కొవింద్ వీడ్కోలు వేడుకలోను..
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ వీడ్కోలు వేడుకలోను ఖర్గేకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పక్కనే సీటు కేటాయించినప్పటికీ ఆయన కూర్చోలేదని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వివాదం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొనే ఆయన్ను మొదటివరుసలో కూర్చోబెట్టామని, కేబినెట్ మంత్రులు రెండో వరుసలో కూర్చున్నారని వెల్లడించారు. ఈ తరహా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications