ఇండియా ఛైర్మన్‌గా ఖర్గే.. ప్రధాని అభ్యర్థిపైనా: మమత, నితీష్ మధ్య తీవ్ర పోటీ
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు మూడో విడత భేటీకి సన్నద్ధమౌతోన్నాయి. నేడు, రేపు ముంబైలో భేటీ కానున్నాయి. 28 పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యారు. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహించబోతోన్నారు. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల అధినేతలు ముంబైకి చేరుకున్నారు. ఈ విడత సమావేశంలోనే ఇండియా లోగోను ఆవిష్కరించనున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముంబైకి చేరుకున్నారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బిహార్, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు.
కాగా- ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇండియా కూటమి ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. దీనికోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అత్యంత సీనియర్, దళిత నేత కావడం వల్ల ఖర్గేను ఉమ్మడి కూటమి ఛైర్మన్‌గా ఎన్నుకుంటారని తెలుస్తోంది.
అత్యంత కీలకమైన కన్వీనర్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మమతా బెనర్జీ, జనతా దళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లల్లో ఒకరిని ఎన్నుకుంటారని సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కూటమిలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు.
కన్వీనర్ పదవి రేసులో నితీష్ కుమార్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్వీనర్‌గా ఎన్నికైన నాయకుడినే ప్రధానమంత్రి అభ్యర్థిగానూ ప్రకటించవచ్చని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని సమర్థవంతంగా ఢీ కొట్టగలిగే సామర్థ్యం, అనుభవం, రాజకీయ చతురత నితీష్ కుమార్ ఒక్కడికే ఉందంటూ జేడీయూ నేతలు స్పష్టం చేస్తోన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications