వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైట్ లైఫ్: ఇక 24గంటలపాటు పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్, జనవరి 26 నుంచే..

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక నగరంగా వెలుగొందుతున్న ముంబైలో ఇకపై మాల్స్, పబ్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు 24 గంటలపాటు తెరచివుండనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన వెల్లడించారు.

ఇక 24 గంటలపాటు పబ్బులు, రెస్టారెంట్లు..

ఇక 24 గంటలపాటు పబ్బులు, రెస్టారెంట్లు..

పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లోనే దీన్ని అమలు చేయనున్నారు. జనవరి 26 నుంచి ముంబైలోని ఫోర్ట్ అండ్ కాలా ఘోడా, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతాల్లో అనుమతించిన మాల్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు, పబ్బులు 24/7 తెరచుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, నగర పోలీసు కమిషన్ కార్యాలయం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. కాగా, గత బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలోనే శివసేన ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం గమనార్హం.

రాత్రిపూట వెలుగులు..

రాత్రిపూట వెలుగులు..

‘ప్రజల నివాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లోని మాల్స్, పబ్బులు, రెస్టారెంట్లకు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నాం. మెరైన్ డ్రైవ్, నారీమన్ ది పాయింట్, గేట్ వే ఆఫ్ ఇండియా, సీఎస్టీ లాంటి ప్రాంతాల్లోని వాటికి అనుమతిస్తున్నాం. రాత్రిపూట సేద తీరేవారి కోసం, పర్యాటకుల కోసం ఈ మేరకు అనుమతిస్తున్నాం' అని మంత్రి జరిపిన సమావేశంలో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. పోలీస్ కమిషనర్ సంజయ్ బార్వే మాట్లాడుతూ.. 24 గంటలపాటు కొనసాగే మాల్స్, పబ్బులు, రెస్టారెంట్లు తప్పనిసరిగా సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

పైలట్ ప్రాజెక్టుగా...

పైలట్ ప్రాజెక్టుగా...


పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లోనే 24గంటలపాటు అనుమతిస్తామని.. ఇది విజయవంతమైతే నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోని మాల్స్, రెస్టారెంట్లు, పబ్బులకు అనుమతిపై ఆలోచిస్తామని మంత్రి ఆదిత్య థాక్రే వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రెస్టారెంట్, పబ్బులు, మాల్స్ నిర్వాహకులు స్వాగతించారు. ఇది చాలా మంచి నిర్ణయమని, ముంబై ఎప్పుడూ నిద్రపోదని అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. పర్యాటకం కూడా పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని, ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు.

వ్యతిరేకిస్తున్న బీజేపీ

వ్యతిరేకిస్తున్న బీజేపీ

కాగా, ప్రజలు నివాసాలు ఉండే ప్రాంతాల్లో 24గంటలపాటు మాల్స్, పబ్బులు, రెస్టారెంట్లకు అనుమతివ్వడంపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆశీష్ షెలర్ వ్యతిరేకించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించిన తర్వాతే అమలు చేయాలని అన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు తొందరపాటు మంచిది కాదన్నారు.

English summary
The nightlife of Mumbai will be back soon. Maharashtra tourism minister Aditya Thackeray’s long-awaited "nightlife for 24/7" pet project has received the green signal and conveyed establishment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X