వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాట్సాఫ్: సహాయక చర్యల కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న హీరో

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేరళ వరదలు సహాయానికి మలయాళం హీరో పెళ్లి వాయిదా

గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళ భారీ వరద నష్టాన్ని చవిచూసింది. అందమైన ప్రదేశాన్ని ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. దేవభూమిలో ప్రకృతి ప్రకోపానికి కేరళ తుడిచిపెట్టుకుపోయింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా చాలామంది నిరాశ్రయులు అయ్యారు. పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలిపోయారు. ఇక కేరళ ప్రజలను ఆదుకునేందుకు దేశం కదిలింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలతో పాటు అక్కడి స్థానికులు చాలా మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.ఇదంత ఒకటైతే ప్రముఖ మళయాలీ నటుడు కేరళ వరదబాధితులను ఆదుకునేందుకు అతని వివాహమే వాయిదా వేసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాడు.

రాజీవ్ పిల్లాయ్... ప్రముఖ మళయాలీ నటుడు.తన సొంతూరు నన్నూరు వరదల్లో మునిగింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ యువనటుడు తన వివాహాన్నే వాయిదా వేసుకున్నాడు. ఈ ప్రకృతి ప్రకోపానికి నన్నూరు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ విషాద ఘటన రాజీవ్ పిల్లాయ్‌ని కలచివేసింది. తన సొంతూరును తను కాకపోతే మరెవరు ఆదుకుంటారు అని భావించి మూడు రోజుల క్రితం జరగాల్సిన వివాహాన్ని వచ్చే నెలకు వాయిదా వేసుకున్నాడు. తన ఊరును కాపాడుకునేందుకు ముందుకు కదిలాడు. రాజీవ్ తన వివాహం వాయిదా వేసుకున్నట్లు షకీల అనే సినిమాలో నటిస్తున్న తన సహచర నటి రిచా చద్దా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

"నా స్నేహితుడు, షకీలా చిత్రంలో నా సహచర నటుడు రాజీవ్ పిల్లాయ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. మూడురోజుల క్రితం తన పెళ్లి జరగాల్సి ఉంది. కేరళలో సహాయక చర్యలు చేపట్టేందుకు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. సహాయక చర్యల్లో భాగంగా బోట్లను, చెక్క మొద్దులను నీటిలో తీసుకెళ్లి చాలా మందిని కాపాడారు."అని ట్వీట్ చేస్తూ అతని ఫోటోలను పోస్ట్ చేసింది రిచా. ఈ పోస్టును చూసిన నెటిజెన్లు రాజీవ్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేశారు.

Malyalam actor postponed his wedding for rescue operations in Kerala

'ఒరు ముత్తాసి గధ', 'తలైవా' లాంటి హిట్ చిత్రాల్లో రాజీవ్ నటించాడు. తను కూడా కేరళను వరదలు ఎలా ముంచెత్తాయో చెబుతూ వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక ఫోటోను పెడుతూ... ఫోటోలో తన వెనక కనిపించేది మెయిన్ రోడ్ అని, తన ఇంటికి సమీపంలో ఉందని చెప్పాడు. అయితే అంత సేమ్ టూ సేమ్ ఉన్నప్పటికీ రవాణాలో మాత్రమే కొంచెం తేడా కనపించిందంటూ పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే రాజీవ్ పిల్లాయ్ అజిత అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మనువాడనున్నాడు. కేవలం 10 మంది అతిథుల సమక్షంలోనే వివాహం చేసుకోనున్నాడు. వరదల కారణంగా తన పెళ్లిని వచ్చే నెలకు వాయిదా వేసుకున్నాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమవంతు సహాయం చేస్తూ తమ అభిమానులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.

English summary
Kerala has witnessed one of its worst floods in a century. Rescue and relief operations are on in full-swing in the flood-hit state.Along with Army, Navy, Air Force, NDRF, fishermen and locals have also come in large number to rescue people in various parts of Kerala.In a bid to help rescue locals in his hometown Nannoor, Malayalam actor Rajeev Pillai postponed his wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X