వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ; ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే; రాజకీయ వర్గాల్లో ఆసక్తి

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అంతకు ముందు, ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి సుబ్రమణ్యస్వామిని కలుస్తారు. మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కలవనున్నారు.

వంటింట్లో 144 సెక్షన్ విధించాల్సిందే: మండిపోతున్న టమాటా ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్!!వంటింట్లో 144 సెక్షన్ విధించాల్సిందే: మండిపోతున్న టమాటా ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్!!

 మోడీతో భేటీ కానున్న మమతా బెనర్జీ

మోడీతో భేటీ కానున్న మమతా బెనర్జీ

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బెనర్జీ జాతీయ రాజధానికి ఇది రెండవ పర్యటన. సెప్టెంబరు 30న జరిగిన భబానీపూర్ ఉపఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ప్రియాంక టిబ్రేవాల్‌ను ఓడించి తన ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్న తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. నవంబర్ 29వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది

 పశ్చిమ బెంగాల్ లో బాగా పుంజుకున్న టీఎంసీ

పశ్చిమ బెంగాల్ లో బాగా పుంజుకున్న టీఎంసీ

కాంగ్రెస్ మరియు బీజేపీతో సహా వివిధ పార్టీల నుండి అనేక రాజకీయ నాయకులు టిఎంసిలో చేరడంతో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ రాజకీయంగా తన మార్క్ చూపించారు. ఈ నేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ రాజధాని పర్యటన, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రి బాబుల్ సుప్రియోతో సహా అనేక మంది ప్రముఖ బిజెపి నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . అంతేకాకుండా, గతంలో బిజెపి గెలిచిన దిన్‌హటా మరియు శాంతిపూర్ నియోజకవర్గాలలో పట్టు సాధించడం ద్వారా ఇటీవల ముగిసిన ఉపఎన్నికలలో టిఎంసి భారీ విజయాన్ని సాధించింది. దీనితో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కాషాయ పార్టీ బలం దాని అసలు 77 నుండి 70 కి తగ్గింది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలం 215 నుండి 217 కి పెరిగింది.

కేంద్రంతో తలపడుతున్న బెనర్జీ .. నేడు మోడీతో భేటీపై ఆసక్తి

కేంద్రంతో తలపడుతున్న బెనర్జీ .. నేడు మోడీతో భేటీపై ఆసక్తి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల త్రిపుర మరియు గోవాలలో తన పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాలలోనూ మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను సమీకరించేందుకు బెంగాల్ సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య ఈరోజు సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి వీరిద్దరి సమావేశంపై నెలకొంది.

 బీఎస్ఎఫ్ పరిధిపై, కేంద్ర నిధులు, త్రిపుర హింస ఘటనలపై మోడీతో చర్చ

బీఎస్ఎఫ్ పరిధిపై, కేంద్ర నిధులు, త్రిపుర హింస ఘటనలపై మోడీతో చర్చ

సరిహద్దు భద్రతా దళం (BSF) అధికార పరిధి సమస్య గురించి వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. బిఎస్ఎఫ్ యొక్క పరిధిని కేంద్రం విస్తరించడంతో ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ఢిల్లీ పర్యటనకు ముందు, మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీఎస్ఎఫ్ సమస్యపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చిస్తానని పేర్కొన్నారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ తీసుకున్నానని, బిఎస్ఎఫ్ సమస్య మరియు బెంగాల్ యొక్క ఇతర అభివృద్ధి సమస్యలకు సంబంధించి, కేంద్రం నిధులకు సంబంధించి, త్రిపురలో చోటు చేసుకున్న రాజకీయ హింస గురించి కూడా మోడీతో చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

బీఎస్ఎఫ్ పరిధి విస్తరించటాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం

బీఎస్ఎఫ్ పరిధి విస్తరించటాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం

పశ్చిమ బెంగాల్ శాసనసభ నవంబర్ 16 న రాష్ట్ర అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కి.మీ నుండి 50 కి.మీ వరకు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ తర్వాత ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించిన రెండో సరిహద్దు రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ అవతరించింది. పశ్చిమ బెంగాల్, పంజాబ్ మరియు అస్సాంలలో కేంద్ర బలగాల అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎఫ్ చట్టాన్ని సవరించింది. దీనిని బెంగాల్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee is scheduled to meet Prime Minister Narendra Modi to discuss the BSF issue and other development issues in Bengal, as well as central funding and political violence in Tripura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X