శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది.. కానీ - రాజశేఖర్

తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్'‌గా సుపరిచితుడైన నటుడు రాజశేఖర్. తనకంటూ ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. నటుడిగా మాత్రమే కాకుండా వైద్యుడిగా కూడా అరుదైన ఘనత సాధించారు. 1962 ఫిబ్రవరి 4న జన్మించిన ఆయన.. చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో వైద్య వృత్తిని వదిలి 1980ల చివర్లో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. తొలి దశలో విలన్, సపోర్టింగ్ పాత్రలు పోషించిన తర్వాత పూర్తి స్థాయి హీరోగా ఎదిగారు.

కాగా హీరోగా మారిన తర్వాత రాజశేఖర్ యాక్షన్ ఇమేజ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. Ankusham, Allari Priyudu, Simha Raasi, Gorintaku, Evadaithe Nakenti వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. యాక్షన్‌తో పాటు కుటుంబ కథా చిత్రాల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఓ దశలో హీరోగా అవకాశాలు తగ్గినా 2017లో వచ్చిన PSV Garuda Vega చిత్రంతో రాజశేఖర్ ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చారు.

actor-dr-rajasekhar-opens-about-marriage-proposal-with-actress-sridevi-and-jeevitha-suggestion-goes

ఆ తర్వాత Kalkiతో మరో హిట్ అందుకుని, Shekarలో మానసిక వైద్యుడిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్ తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా ఓపెన్ అయ్యారు. నితిన్ నటించిన సినిమాలో కీలక పాత్ర పోషించినా ఆ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ Bikerలో హీరో తండ్రి పాత్రలో కనిపించి తన నటనతో మళ్లీ ఆకట్టుకున్నారు.

శ్రీదేవితో పెళ్లి..

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. దివంగత నటి శ్రీదేవి మొదట తనను పెళ్లి చేసుకోవాలని అడిగిందని ఆయన వెల్లడించారు. అయితే తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు బలంగా ఉండటం వల్ల సొంత కులం అమ్మాయినే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారని తెలిపారు. దాంతో ఆ విషయాన్ని నటి జీవితతో ప్రస్తావించగా.. "ఒకవేళ నువ్వు వేరే ఎవరినైనా వివాహం చేసుకోవాలని అనుకుంటే అది నీ వ్యక్తిగత నిర్ణయమని చెప్పిందన్నారు. కానీ అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతా అని స్పష్టం చేసిందని రాజశేఖర్ తెలిపారు.

ఇక జీవిత మాటలు విన్న తర్వాత ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. కుల కట్టుబాట్లు, కుటుంబ ఒత్తిళ్ల నడుమ ఆయన వివాహం అప్పట్లో ఓ పెద్ద సంచలనం. కాగా నాటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరూ టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. వీరి ఇద్దరు కుమార్తెలు సైతం హీరోయిన్లుగా రాణిస్తూ బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+