మమతకు షాక్: ఢాకా నుండి వస్తూ సన్నిహితుడైన బిజినెస్‌మెన్ అరెస్ట్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్! మమతా బెనర్జీకి సన్నిహితుడు అయిన షిభాజీ పాంజాను అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుండి రాగా.. కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
ఇతనిని ఆర్థిక నేరాల కేసు విషయంలో అరెస్టు చేశారు. షిభాజీ పాంజా స్మాల్‌టైమ్ బిజినెస్‌మెన్. గత కొన్ని ఏళ్లుగా అతను మమత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్నారు.

లుకౌట్ నోటీసు
షిబాజీ పాంజా పైన ఫిబ్రవరి 19వ తేదీన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను పలు టెలివిజెన్ చానళ్లలో పెట్టుబడులు పెట్టారు. అతని ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్స్ పైన అనుమానాలు తలెత్తాయి. ఈనేపథ్యంలో అతని పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఇతను రూ.1400 కోట్ల ఓ కంప్యూటర్స్ తయారీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. పశ్చిమ బెంగాల్‌లో అతనికి ఓ టీవీ ఛానల్ ఉంది. అతను ఢాకా నుండి కోల్‌కతాకు రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతనిని అరెస్టు చేశారు. పోలీసులకు అప్పగించారు. అతనిని ఢిల్లీ పోలీసులకు అప్పగించనున్నారు.
మమతా బెనర్జీకి...
2011లో ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ప్రచారం టీంలో పని చేశారు. పరిబర్తన్, మా మాటీ మనుష్... అనే స్లోగన్ ప్రచారంలో ఇతనిది కీలకపాత్ర. అప్పటి నుండి మమత ప్రభుత్వానికి దగ్గరవుతున్నారు.












Click it and Unblock the Notifications